Viral

అక్రమ నిర్మాణాలు చేపట్టి దోచుకుంటున్న ద్వారంపూడి… -కొండబాబు-

WhatsApp Image 2024-03-13 at 4.41.27 PM

గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తీసుకువచ్చిన కాకినాడ స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని చేపట్టారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. నేడు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అక్రమ సంపాదన కోసం సొంత జాగీర్లా ఎక్కడకక్కడ అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేపట్టి కాకినాడ నగరాన్ని లూటీ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

బుధవారం స్థానిక మెయిన్ రోడ్డు మసీదు సెంటర్ మరియు సంత చెరువు సెంటర్ నందు ఎమ్మెల్యే నిర్వహించిన అక్రమ నిర్మాణ స్థలాన్ని కొండబాబు మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నగర సుందరీకరణలో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం ఇచ్చి కాకినాడ నగరాన్ని సుంద్రీకరణగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. నేడు ఎమ్మెల్యే ద్వారంపూడి తన అక్రమ సంపాదన కోసం ప్రధాన కూడలిలలో షాపులు నిర్మించి వాటిపై అద్దేలు వసూలు చేస్తూ దోచుకుంటున్నాడని మండి పడ్డారు.

స్థానిక మసీదు సెంటర్ నుండి రాజా రామ్మోహన్ రాయ్ రోడ్డుకు వెళ్లే కూడలి ప్రాంతంలో ఉన్న స్థలానికి గతంలో టి.డి.ఆర్. బాండ్లు తీసుకుని నేడు మరల అదే స్థలంలో వ్యాపార సంస్థకు ఎమ్మెల్యే అద్దెకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఇదే కాకుండా ఎక్కువ రద్దీ ప్రాంతమైన సినిమా రోడ్డు, సంత చెరువు కనకదుర్గమ్మ ఆలయానికి చేర్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టి వాటిని విక్రయించి కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆయన ప్రస్తావించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.