వైద్యం పొందాలన్నా… వైద్య సేవలందించాలన్నా… అక్కడ ప్రాణాలతో చెలగాటమే. ఎగసిపడే కెరటాలపై ఊగిసలాడే మరబోటులో గంటపాటు ప్రయాణించాల్సిందే… అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుంచి బోటులో ప్రయాణం చేస్తే మగసనితిప్ప అనే చిన్న కుగ్రామం వస్తుంది. ఆ ప్రాంతం సుమారు 500 కుటుంభాల సముదాయం, వారందరికీ శిధిలావస్తలో కూలిపోయోందుకు సిద్దంగా ఉన్న పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే ఆరోగ్య ప్రధాయిని. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దుర్గారావు దొర, పల్లంకుర్రు సిబ్బందితో పాటు మగసనితిప్ప గ్రామాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
అక్కడ వైద్యులు సైతం… తెగించాల్సిందే !!!

