Trending News

అక్కడ… డెమో సెక్షనేలేదు..!!!

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో కుంటుపడ్డ ఐఈసీ కార్యక్రమాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజనలో భాగంగా ఏర్పడ్డ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు డెమో సెక్షన్‌ ఏర్పాటు పెద్ద సమస్యగా తయారైంది. అధికారుల అలసత్వం… ఉద్యోగుల రాజకీయ ఫైరవీలు… వెరసి ఆ జిల్లాకు డెమో సెక్షన్‌ లేకుండా చేశాయి. పర్వవసానంగా ఆ శాఖ ప్రచార, ప్రసార కార్యక్రమాలు కుంటుపడ్డాయి. నూతనంగా ఏర్పడ్డ జిల్లాకు ఏది అవసరమైనా తక్షణం ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించినా స్పందన కరువవుతోందని వాపోతున్నారు.

ప్రభుత్వ పథకాలు విస్త్రుతంగా ప్రజల్లోకి వెల్లాలంటే ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. ప్రచార ప్రసార సాథనాలను సంవృద్దిగా సకాలంలో సద్వినియోగం చేయాలి. కరపత్రాలు, గోడపత్రికలు, హోర్డింగ్స్‌, పత్రికల్లో ప్రకటనలు, టీవీ-సోషల్‌ మీడియాలో ప్రచారాలు ఇలా అన్ని విధానాలను వినియోగించడం తెలుసుండాలి. అప్పుడే ఆయా ప్రభుత్వాల ప్రచారం విస్త్రుతంగా ప్రజల్లోనికి వెళ్లడమే కాకుండా సత్పలితాలుంటాయి. ఈ కార్యక్రమాలను కార్యాచరణలో పెట్టేదే… డెమో (డిస్ట్రిక్ట్‌ ఎక్ష్‌టెన్షన్‌ అండ్‌ మీడియా ఆఫీసర్‌) సెక్షన్‌. ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అంతర్భాగంగా పనిచేస్తుంది. ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ కో-ఆర్డినేషన్‌ (ఐఈసీ) కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఎప్పటికప్పుడు ఈ డెమో సెక్షన్‌ సమాచారాన్ని అందజేస్తుంది.

రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఒక డెమో, ఇద్దరు డిప్యూటీ డెమోలు పనిచేస్తుండేవారు. జిల్లాల విభజనలో భాగంగా డెమోలను యథా స్థానాల్లో ఉండి, డిప్యూటీ డెమోలను కొత్త జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రికి ఒకరు, అమలాపురంనకు మరొక డిప్యూటీ డెమో వెల్లాల్సి ఉంది. రాజమండ్రికి ఒకరు బదిలీ కాగా, అమలాపురానికి వెల్లాల్సిన డిప్యూటీ డెమో తన రాజకీయ పలుకుబడితో బదిలీని నిలుపుకున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి, ఉత్తర్వులకు వ్యతిరేకంగా… డెమోను అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదిలీ చేయించేందుకు విశ్వప్రయత్నం చేసినట్టు తీవ్ర విమర్శలున్నాయి. అంబేద్కర్‌ కోనసీమకు వెల్లాల్సిన డిప్యూటీ డెమో ఉన్నతాధికారుల ఉదాసీనతతో కాకినాడ జిల్లాలోనే కొనసాగుతుండటం ఇప్పటికీ చర్చానీయాంశంగానే ఉంది. డిప్యూటీ డెమోలు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో జీతాలు పొందాల్సి ఉండగా… కాకినాడ జిల్లాలో జీతం పొందుతుండటం ఉన్నతాధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోందని ఉద్యోగ సంఘ నాయకులు విమర్శిస్తున్నారు.

Avatar

Spy News

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్