విజయనగరంలో లోకేశ్ యువగళం నవశకం సభా వేదికను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. టీడీపీ, జనసేన పార్టీలకు సంబందించి 600 మంది ప్రముఖులు ఆశీనులయ్యేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. స్టేజ్ కుడి వైపు నందమూరి తారక రామారావు, టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.స్టేజ్ ఎడమ వైపు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.స్టేజ్ ముందు తెలుగు దేశం, యువ గళం పేరిట భారీ రంగవల్లికను తయారుచేశారు. 3 లక్షలు మంది జనాలు కుర్చొనేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

