అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె సందర్భంగా సీ.ఎం. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని, సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు, రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం స్థానిక కచేరిపేటలోని సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి. బేబిరాణి, తదితరులు మాట్లాడుతూ గతేడాది డిసెంబరు 12 నుండి మొదలైన అంగన్వాడీ సమ్మె జనవరి 22 అర్ధరాత్రితో ముగిసిందన్నారు.దానర్థం పోరాటం ముగిసినట్లు కాదని తాత్కాలిక విరామమేనని తెలియజేశారు.
అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా, తొలగించిన వారందరినీ బేషరతుగా విధులలోకి తీసుకునేలా, తదితర అంశాలపై అంగీకరించిన తరువాతే విరమించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బాలం లక్ష్మీ, జిల్లా ఆఫీస్ బేరర్స్ రాజేశ్వరి, నాగమణి, ఎస్తేరు రాణి, బుల్లెమ్మ, మేరీ సమాధానం, లక్ష్మీ, వీరవేణి, చామంతి, నీరజ తదితరులు పాల్గొన్నారు.

