రాష్ట్ర వ్యప్తంగా అంగన్వాడీ వర్కర్లు సమస్యల పరిష్కారంపై చేస్తున్న నిరాధార సమ్మె 41వ రోజుకు చేరుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబందించి ఎటువంటీ సానుకూల నిర్ణయాలు తీసుకోకుండా ఉద్యోగులపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకు సంబందించి అంగన్వాడీలు వెంటనే విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయాన్ని తీసుకుంది. షోకాజ్ నోటీసులు ఇచ్చామని గడువు పూర్తయినందున తదుపరి చర్యలకు అంగన్వాడీ వర్కర్లు సిద్దంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్త నియామాలకు కరసత్తులు చేస్తున్నట్లు సమాచారం.
అంగన్ వాడీ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు…

