ఆటోను ఢీకొన్న కార్ 5గురికి గాయాలు…
సామర్లకోట-కాకినాడ ప్రధాన రహదారిలో మామిల్లదొడ్డి వంతెన సమీపాన అయిదుగురు ప్రయాణికులతో కాకినాడ వెళుతున్న ఆటోను కాకినాడ నుంచి పెద్దాపురం వెళుతున్న వేగనార్ కారు అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. కేసుసామర్లకోట పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
