WhatsApp Image 2024-02-12 at 8.09.04 AM Viral

మహిళ కు సీ.పీ.ఆర్. చేసి కాపాడిన పోలీస్…!!!

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి లో ఒక మహిళకు పోలీస్ అధికారి సీ.పీ.ఆర్. చేసి తన ప్రాణాలను కాపాడారు. స్థానిక వలిగొండ రోడ్డుపై వెళ్తూ మహిళ హటాత్తుగా గుండె పోటుకు గురికావడంతో అక్కడిక్కడే కుప్పకూలి పడిపోయింది అదే చోట విదుల్లో ఉన్న ఎస్.ఐ. మహేందర్ లాల్ వెంటనే స్పందించి ఆమె గుండెలపై గట్టిగా వొత్తుతూ సీ.పీ.ఆర్. చేసి ఆమెను భ్రతికించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అతను చేసిన పనికి పరిసర ప్రాంత వాసులందరూ ఆయనను కొనియాడారు.