తీవ్రవాయుగుండంగా బలపడిన వాయుగుండం…
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రేపటికి తుఫానుగా మారే అవకాశమున్నట్లు తెలిపింది. తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్నట్లు తెలిపింది.దీని ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ అన్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు, వ్యవసాయల్లో పనిచేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి […]
