విశాఖలో బాధిత మత్స్యకారులకు పవన్ కల్యాణ్ భరోసా ….
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్నిప్రమాద సంఘటనా ప్రాంతాన్ని, బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (శుక్రవారం) పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన అధిపతి ప్రకటించారు. మత్స్యకారులకు ఆపత్కాలంలో అండగా ఉంటామన్నారు. హార్భర్ పరిశీల అనంతరం బాధిత మత్స్యకారులతో పవన్ మాట్లాడనున్నారు.
