ఉత్తరాఖండ్‌లోని చిర్బాసాలో విరిగిపడ్డ కొండచర్యలు…
ఆదివారం ఉదయం చిర్బాసాలోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు యాత్రికులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని సంభందిత అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్.డీ.ఆర్.ఎఫ్. బృందం క్షతగాత్రులను తరలించి ఆసుపత్రికి తరలించారు. మృతుల ముగ్గురి మృతదేహాలను ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందం జిల్లా పోలీసులకు అప్పగించింది. యాత్రికులు గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించడానికి ప్రయాణిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం తెలిపింది.
