WhatsApp Image 2024-03-18 at 6.46.16 PM Telangana

టాటా బ్రాండ్ తనేరియా శారీ రన్ కార్యక్రమంలో నారా బ్రాహ్మిణి…

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో టాటా బ్రాండ్ తనేరియా ఆధ్వర్యంలో శారీ రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమని నారా బ్రాహ్మిణి విచ్చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆమె రన్ జండాను ఊపి రేస్ ను ప్రారంభించారు. ఇందులో మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. తనేరియాా బ్రాండ్ ద్వారా మంగళగిరి […]

Dead Viral

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి…

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో నలుగురు రైతులకు కరెంట్ షాక్ తగిలింది. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన ఉష్కల రోశయ్య అనే రైతు పొలంలో బోరు మోటారు దించే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. మృతి చేందిన వ్యక్తి భూమయ్య గా పోలీసులు నిర్ధారించారు.

WhatsApp Image 2024-03-08 at 5.12.31 PM Telangana

ఉద్యోగాల భర్తీపై జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి… -ఎమ్మెల్సీ కవిత-

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభత్వంగా మారిందని, ఉద్యోగాల భర్తీ విషయంలో జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… బీ.ఆర్.ఎస్. ప్రస్తావన లేకుండా తెలంగాణ జాగృతి తరపున ఈ దీక్ష చేస్తున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం నాడు ధర్నా చేయాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు.

OIF (2) Telangana

కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌…!!!

తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్‌.ఎస్‌. పార్టీకు రాజీనామా చేసిన మరుసటి రోజు గాంధీభవన్‌లో ఏ.ఐ.సీ.సీ. ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌ మున్షీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… 24 ఏళ్లుగా గులాబీ పార్టీకి సేవలందించిన శ్రీలత, ఆమె భర్త వంటి వారిని పక్కనపెట్టి కొత్తగా చేరిన వారికి బీ.ఆర్‌.ఎస్‌. కీలక పదవులు […]

WhatsApp Image 2024-01-18 at 2.02.43 PM Political

ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా పేదలకు వస్త్రాలు పంపిణీ… – కొండబాబు –

సినీరంగంలో మరియు రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సిటీ నియోజకవర్గం సంతచెరువు సెంటర్ నందు ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి […]

maxresdefault (2) Telangana

చౌటుప్పల పట్టణంలో 2 రోజు ప్రజా పాలన కార్యక్రమం…

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని రెండవ రోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యం తిరిగి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం ఆరు సంక్షేమపథకాల అమలుకు రెండవ రోజు శ్రీకారం చుట్టడం జరిగినది అన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందనడానికి నిదర్శనంగా 6 గ్యారెంటీల పథకాలకు […]

revanth%20reddy_edited Telangana

తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు నమోదు…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఆరు హామీల అమలు మేరకు వాటికి సంబందించిన పనులను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హులను గుర్చించి వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యప్తంగా ఏర్పాటుచేసిన ప్రజా పరిపాలన కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఏర్పాటుచేసిన ఒక్క రోజులోనే 7.46 లక్షల దరఖాస్తులను లబ్దిధారులనుంచి స్వీకరించామని అధికారిక తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, అభయహస్తం, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ […]

th (1) Political

కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలల్లో రేవంత్ రెడ్డి…

మహా రాష్ట్రలో నాగ్ పూర్ లో కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వెడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడిందని, భారత న్యాయ యాత్ర తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఎర్రకోటపై పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. 56 అంగుళాల […]

887910-amit-shah-new Exclusive

ఇబ్రహీంపట్నంలో సమావేశానికి హాజరయిన అమిత్ షా…

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించడానికి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సమీక్షించడానికి ఇతర చర్చలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీ.జే.పీ. యూనిట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ స్థాయిల్లోని బీ.జే.పీ. రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహలపై చర్చించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఔత్సాహిక కార్యక్రమం వికాసిత్ భారత్, రామమందిర శంకుస్థాపనతో సహా […]

rv Viral

సీ.ఎం. రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ…

ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపనేత భట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల సమస్యలపై ముఖ్యమంత్రి ధ్వజమెత్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదేవిదంగా సమయాన్ని బట్టి సి.ఎం., డిప్యూటీ సి.ఎం. కలిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులతో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశముందని తెలిపారు.