త్వరలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పునరుద్దరణ.. స్మార్ట్‌సిటీ ఎండీ నాగనరసింహారావు వెల్లడి
స్మార్ట్‌సిటీ పర్యవేక్షణలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)ను త్వరలోనే పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్మార్ట్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్, సీ.ఈ.వో, నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు చెప్పారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఐసీసీసీని పునరుద్దరించే అంశంపై తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… రూ. 98 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్‌సెంటర్ నిర్వహణ చేసేందుకు మూడు ఏజన్సీలతో మాట్లాడామన్నారు. ఇందులో ఒక ఏజన్సీని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. […]

