table-tennis Exclusive

మధ్య ప్రదేశ్ టేబుల్ టెన్నిస్ క్రీడలకు వైష్ణవి సూర్య ఎంపిక…

గౌతమీ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన వైష్ణవి సూర్య తన క్రీడా నైపుణ్యంతో 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ క్రీడలకు ఎంపిక అయ్యిందని టేబుల్ టెన్నిస్ కోచ్ వి.టి.వి. సుబ్బారావు తెలియజేశారు. తను 2024 జనవరి13 నుండి 19 వరకు మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహింపబడు 67వ స్కూల్ నేషనల్ అండర్ 19 బాలికల టేబుల్ టెన్నిస్ క్రీడల జట్టు పాల్గొనుందని తెలిపారు. ఆమె రాష్ట్రంలో జరిగిన క్రీడలో ఆడి తన నైపుణ్యంతో […]

WhatsApp Image 2024-01-11 at 10.24.21 AM Exclusive

వారు విజయం సాదించారు…

సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్డు , దేవాలయం వీధి, కలెక్టరేట్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాకినాడ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎం.చంటిబాబు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ తో చర్చలు విఫలమైతే నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కెల్ అమలు చేయాలని, అన్ని కేంద్ర పథకాలలో […]

WhatsApp Image 2024-01-10 at 10.33.20 AM Exclusive

రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడి… -ఏఐటియుసి కార్యదర్శి తోకల ప్రసాద్-

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో చలో రాజమండ్రి ఆర్జెడి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కాకినాడ కమిటీ సభ్యులు చలో రాజమండ్రి బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య మొండి వైఖరి మానుకోవాలన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, […]

WhatsApp Image 2024-01-09 at 3.18.22 PM Viral

పర్మినెంట్ చేయండి లేదా వేతనాలు పెంచండి… -తాటిపాక మధు-

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యల కోసం చేపట్టిన సమ్మెను ప్రభుత్వం వెంటనే విరమించే విధంగా తక్షణం చర్యలు చేపట్టాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు తాడేపల్లి ప్యాలెస్ కి వస్తారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి మోకాళ్ళతో నడుస్తూ కమిషనర్ చాంబర్ వరకు నిరసన […]

WhatsApp Image 2024-01-08 at 5.10.22 PM Exclusive

ఢిల్లీ రైతు ఉద్యమ స్పూర్తితో…. ముందుకు నడుద్దం…!!!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. దేనికి తలవంచని మోడీని మెడలు వంచిన ఘనత ఢిల్లీ రైతు ఉద్యమానికి దక్కుతుందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 450 రైతు సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చి చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిందన్నారు. 13 నెలలుగా నిర్విరామంగా నిద్రాహారాలు మాని రైతులు చేసిన పోరాటానికి మోడీ తలవంచక […]

947e8202-b1ab-4c3c-a107-d2550718878b Viral

రాజమండ్రిలో కదం తొక్కిన రైతాంగం…

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 18వ మహాసభను రాజమండ్రిలో ఘనంగా ప్రారంభించారు. ఈ మహాసభను రైతులు మున్సిపల్ స్టేడియం నుండి శ్యామల సెంటర్ మీదుగా వెళ్లి డీలక్స్ సెంటర్, విజయ థియేటర్ రోడ్డు, గోదావరి గట్టు మీదుగా రివర్ బే రిసార్ట్స్ ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది రైతులు విచ్చేసి కదం తొక్కారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి […]

maxresdefault Political

రాష్ట్రంలో డ్రగ్స్, గంజా ఎక్కువవుతున్నాయి… -వంగలపూడి అనిత-

రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజా ఎక్కవ కావడంతో అరాచకాలు ఎక్కువవుతున్నాయని రాష్ట్ర తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఇటీవల ఒక మైనర్ దళిత బాలిక (17) ను గ్యాంగ్ రేప్ చేసారన్నారు. రాజమండ్రిలో గతంలో ఇదే మాదిరిగా ఒక దళిత యువతి అత్యాచారానికి గురైందని అన్నారు. మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్ చేశారన్నారు. ఇందుకు కారణమయి వారిని ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేదని వాపోయారు. దీనికి కారణం […]

bh Exclusive

టిక్కెట్లు నిరాకరించినా తొందరపడొద్దు… -ఎంపీ భరత్-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టిక్కెట్టు నిరాకరించినట్లయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. భరత్‌ సూచించారు. జగ్గంపేట వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీని వీడే అవకాశం ఉందన్న పుకారులపై ఎం.పీ. స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ చరిష్మా వల్లే గత ఎన్నికల్లో లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యామన్నారు. వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. అధికారాన్ని నిలబెట్టుకుంటే రాజకీయంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. […]

WhatsApp Image 2023-12-28 at 4.38.40 PM Exclusive

జగన్ ఇచ్చిన హామీలు అమలుచేసేవరకు పోరాడతాం… -తాటిపాక మధు-

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 9వ రోజు సమ్మె నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సమ్మెకు ఏ.ఐ.టి.యు.సి. జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరి ప్రమేయం లేకుండానే కడుపుకాలి సమ్మె పోరాటంలోకి వచ్చారని, జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు. అందుకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు రెగ్యులర్ […]

WhatsApp Image 2023-12-23 at 6.42.37 PM Crime

చోరీ కేసులో నలుగురు అరెస్ట్…

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం మురమండలో ఇటీవల జరిగిన టాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను కడియం సీ.ఐ. తిలక్, ఎస్సై మహమ్మద్ హస్పక్ అరెస్టు చేసారు. వారి వద్ద నుండి కొంతమేర చోరీ సొత్తును స్వాధీనపరచుకున్నట్లు వారు తెలిపారు. వివరాలను ప్రకారం మురమండ గ్రామంలో ట్రాక్టర్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దీనిపై తన సిబ్బందితో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయగా, […]