తెలంగాణ సీ.ఎం. ప్రమాణ స్వీకారం…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని పీ.సీ.సీ. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకుంటున్నారని తెలిపారు. మరో వైపు పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏ.ఐ.సీ.సీ. పరిశీలకులు సేకరించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. […]
