ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఈ పొత్తు… -చంద్రబాబు నాయుడు-
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ నుంచి గట్టెక్కేందుకు, అధికార వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసేందుకు జనసేన, బీ.జే.పీ., టీ.డీ.పీ. చేతులు కలిపాయని టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కంకణం కట్టుకున్నాయని అన్నారు. వై.ఎస్.ఆర్.సి.పి. నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు అందరూ చేతులు కలపాలని జనసేన అధినేత పవన్ […]









