పిఠాపురం నుంచే మార్పు మొదలు… -పవన్ కళ్యాన్-
ఈ ఏడాది అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆకంక్షించారు. సర్వ మతాల్లోని వారు, సర్వ ప్రాంతాల్లో ఉండే వారు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపించబోతోందని చెప్పారు. పిఠాపురం నుంచే ఈ మార్పు మొదలు కాబోతోందన్నారు. శ్రీ పురూహుతికా అమ్మవారి ఆశీస్సులు, శ్రీ పాద శ్రీ వల్లభుడి దీవెనలు, బంగారు పాపమ్మ అండదండలతో […]








