OIP (46) Political

ఓటు వేయకుండా తిరిగి రావద్దు… – మమతా బెనర్జీ –

ఈద్ వేడుకలకు తమ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో హాజరైన వలస కార్మికులకు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ టి.ఎం.సి. అగ్రనేత మాట్లాడుతూ… బీ.జే.పీ. నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో తాము తిరిగి అధికారంలోకి వస్తే వారి ఆధార్ కార్డు, పౌరసత్వాన్ని తొలగిస్తుందని పేర్కొన్నట్లు ఏనీ నివేదించింది. ఈద్ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన వలస కార్మికులందరూ దయచేసి ఓటు వేయకుండా వెనక్కి వెళ్లవద్దని […]

CM-KCR-1 Political

కాంగ్రెస్‌లో చేరిన మూడో బీ.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యే…

20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడి తనతో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీ.ఆర్‌.ఎస్‌. అధినేత కే. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. త్వరలో ఆయన తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో యెల్లందు నియోజకవర్గం నుంచి బీ.జే.పీ. అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ ఎం.పీ. డి. రవీంద్రనాయక్ కూడా ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్, కడియం […]

WhatsApp Image 2024-04-19 at 4.14.17 PM Political

కాకినాడ అర్బన్ నుంచి ఎం.ఎల్.ఏ. అభ్యర్ధిగా నామినేషన్ వేసిన వనమాడి కొండబాబు…

కాకినాడ అర్బన్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎం.ఎల్.ఏ. అభ్యర్ధిగా వనమాడి కొండబాబు శుక్రవారం ఉదయం 11 గంటలకు కునామినేషన్ దాఖలు చేసారు. కాకినాడ నగరం జగనదపురంలో ఉన్న తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరి నూకలమ్మ గుడి వెనుక కొత్తగా నిర్ణించిన మునిసిపాల్ కార్యలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన ఇంటిదగ్గర జనసముద్రాన్ని తలపించింది.

WhatsApp Image 2024-04-19 at 4.01.59 PM Political

ముమ్మిడివరం నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. గా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నామినేషన్…

ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శు క్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముహూర్తం ప్రకారం ఉదయం 11 గంటల 14 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ముమ్మిడివరంలో వేంచేసియున్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ జనసందోహం తో ర్యాలీగా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

OIP (44) Exclusive

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా తమ్మినేని వెంకటేశ్వర్లు…

తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పక్షాన సమన్వయ బాధ్యతలను తమ్మినేని వెంకటేశ్వర్లుకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. సహ సమన్వయకర్తగా ఎం. హరిశంకర రావును నియమించినట్లు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో జనసేన, టిడిపి, బీజేపీ నాయకులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలని వారికి పార్టీ అధ్యక్షులు సూచించారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎన్నికల సమన్వయ బాధ్యతలను యెల్లటూరి శ్రీనివాస రాజుకి అప్పగించారు. కాకినాడ పార్లమెంట్ […]

WhatsApp Image 2024-04-18 at 6.29.24 PM Political

పిఠాపురంలో జనసేనలోకి బారీగా చేరికలు…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం, కొత్త మూలపేట గ్రామ పంచాయతీ నుంచి 73 మంది కే.ఎస్.ఈ.జెడ్. బాధితులు గురువారం జనసేన పార్టీలో స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు వారందరినీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం కమిటీ సభ్యులు తెలగంశెట్టి వెంకటేశ్వర్లు, కాట్నం విశాలి, మండల కమిటీ సభ్యులు మలక సూర్యచంద్ర, వడ్డు రాజేష్, బండి సునీల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు […]

WhatsApp Image 2024-04-18 at 6.22.26 PM Political

జనసేనలోకి చేరిన వట్టి పవన్ కుమార్…

మాజీ మంత్రి, దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ ను గురువారం మంగళగిరిలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా వేసీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కుమార్ తో పాటు ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కాటి కిరణ్ అలాగే వై.సీ.పీ. సీనియర్ నాయకులు మంద శ్రీనివాసరెడ్డి, తదితర నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్బంగా ఆయన […]

chandrababu-naidu-1548839707 Political

రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం వస్తుంది… -టీడీపీ అధినేత-

జూన్ 4 తర్వాత ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కచ్చితంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం పెడన, మచిలీపట్నంలో జరిగిన ప్రజా గళం సభల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నాయుడు, ఈ జగనాసురని ఎలా వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికల సర్వేలన్నీ […]

OIP (41) Political

ఆప్ కా రాంరాజ్య వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ…

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆప్ కా రాంరాజ్య వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. రామరాజ్యం అనే పార్టీ భావనను హైలైట్ చేసే లక్ష్యంతో, జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు దేశ రాజధానిలో రాముడి ఆదర్శాలను సాకారం చేసే దిశగా మళ్లించబడ్డాయని చెప్పారు. aapkaramrajya.com వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు ఏప్రిల్ 17న రామ నవమి సందర్భంగా పార్టీ ఆ రోజును ఎంచుకున్నట్లు తెలిపింది. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన పార్టీ ఎం.పీ. సంజయ్ సింగ్ […]

OIP (40) Political

ఏప్రిల్ 19 నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహించనున్న మోడీ…

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక ర్యాలీలు, రోడ్ షోలతో కూడిన ప్రచారాలతో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల డ్రైవ్‌ను బీ.జే.పీ. ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, సహరాన్‌ పూర్ మరియు పిలిభిత్‌లలో మూడు ర్యాలీలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. బహిరంగ సభలకు బీ.జే.పీ.-ఎన్‌.డి.ఎ. అభ్యర్థుల నుండి చాలా డిమాండ్ ఉండి.ఏప్రిల్ 26న రెండవ దశలో ఎన్నికలు జరగనున్న అమ్రోహా నియోజకవర్గం నుండి ఏప్రిల్ 19 నుండి ప్రారంభమయ్యే ఏడు […]