చిలుకలూరిపేటలో ఉమ్మడి బహిరంగసభకు సర్వం సిద్ధం…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భాదత్ జనతా పార్టీ పొత్తు కుదరడంతో పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కలయికతో ఉమ్మడి బహిరంగసభను 17వ తేదీన నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు సంబందించి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు పార్టీల నేతలు కలిసి అక్కడ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వారు వెళ్ళడించారు.
