వాయనాడ్ జిల్లాలో విరిగిపడ్డ భారీ కొండచరియలు…
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడడంతో వందలాది మంది చిక్కుకుపోయారు. దీనిలో అక్కడవారందరూ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కే.ఎస్.డీ.ఎం.ఏ. ఫైర్‌ఫోర్స్ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాల ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ నుండి రెండు బృందాలు కూడా సహాయక చర్యలలో సహాయం చేయాలని సూచించినట్లు కే.ఎస్.డీ.ఎం.ఏ. ప్రకటించింది.


