రైలు గేట్ ను ఢీకొన్న లారీ కంటైనర్…
సామర్లకోట మండలం మాధవపట్నం సమీపాన సర్పవరం రైలు గేట్ ను లారీ కంటైనర్ వేగంగా ఢీకొనడంతో గేట్ విరిగిపోయింది. ఫలితంగా గేట్ సాంకేతిక లోపానికి గురయ్యి సిగ్నలింగ్ వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రైల్వే అధికారులు గేట్ పునర్నిర్మాణ పనులు చేపట్టారు
