పీ. గన్నవరం లో రైతులకు లీజుకు పట్టాల పంపిణీ… -ఎమ్.ఎల్.ఏ. చిట్టిబాబు-
డాక్టర్ బీ.ఆర్. అంబెండ్కర్ కోనసీమ జిల్లా పీ. గన్నవరం మండలం లో భూమి పట్టాల పంపిణీ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీ. గన్నవరం ఎమ్.ఎల్.ఏ. చిట్టిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమాలను అందిస్తుందని దానిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. తరువాత పెదపూడి గ్రామపంచాయితీకి చెందిన 67 మందిరైతులకు లీజుకు పట్టాలను పంపిణీ చేశారు.
