మద్దులపల్లి డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య… కారణమిదే…
జగిత్యాల పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన వైష్ణవి పురుగులు మందు తాగి ఆత్మ హత్య చేసుకుంది.ఆమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే రెండు, మూడో సెమిస్టర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యింది. దానతో ఆమె పురుగు మందు తాగింది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది.
