IMG-20231114-WA0004 Kakinada

నెహ్రూ విగ్రహాన్ని టీ.టీ.డీ. సెంటర్ లో ప్రతిష్టించాలి…

స్వాతంత్ర్య సమరయోధులు 1964 లో నెలకొల్పిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని వారి స్మారక చిహ్నంగా బాలాజీ చెరువు సెంటర్ లో ప్రతిష్ట చేయాల్సిన బాధ్యత పౌర సమాజం పై వుందని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజుపేర్కొన్నారు. నెహ్రూ134వ జయంతి సందర్భంగా బాలాజీ చెరువు (టీ.టీ.డీ.) సెంటర్ లో నెహ్రూ స్మారకఫ్లెక్సీ కి పూలదండలతో పుష్పాంజలి ఘటించారు. నెహ్రూ మరణానంతరం అప్పటి స్వాతంత్ర్య సమర యోధులు 1964లో నవంబర్ 14న బస్ట్ సైజు […]

IMG-20231111-WA0005 Education / Career

చదువుతోపాటు క్రీడల్లోనూ రానించాలి

విద్యార్ధినీ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం అని నారాయణ పాఠశాలల ఏ.జీ.ఎం. రాఘవేంద్రరావు పేర్కొన్నారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలో రామారావు పేట నారాయణ ఇ-టెక్నోస్కూల్ పాఠశాల క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను ఏజీఎం రాఘవేంద్రరావు ప్రారంభించారు. విద్యార్ధినీ విద్యార్ధులు క్రీడాస్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని క్రీడాస్ఫూర్తి ప్రదానం అన్నారు. ప్రిన్సిపాల్ షర్మిల మాట్లాడుతూ… బాలలదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్ధినీ విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం […]

IMG-20231109-WA0034 Trending News

పీ.ఆర్‌. డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం…

పిఠాపురం మహారాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. క్షతగాత్రులకు, అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉంచేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.వి. తీరుపాణ్యం కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని డి.ఎం.హెచ్‌.ఓ. డాక్టర్‌ నరసింహ నాయక్‌, జిల్లా టీబీ కంట్రోల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌. రమేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఎం.హెచ్‌.ఓ. మాట్లాడుతూ… డిగ్రీ విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావటం […]

WhatsApp Image 2023-11-07 at 6.59.25 PM Education / Career

విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని… -డా. కృతికా శుక్లా-

విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధంగా గతంలో పదో తరగతి, ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణత కాని విద్యార్థులచే తిరిగి పబ్లిక్ పరీక్షలు రాయించడం లేదా నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చేర్చే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా‌. కృతికా శుక్లా పాఠశాల విద్యాశాఖ, నైపుణ్య శిక్షణ, ఇంటర్ మీడియట్ అధికారులతో మిషన్ జీ.ఈ.ఆర్. లో భాగంగా 5 సంవత్సరాల […]

IMG-20231103-WA0048 Political

వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం… -మాజీ మంత్రి చిక్కాల-

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతాంగానికి పూర్తిస్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర రావు ఆరోపించారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో చిక్కాల విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వం నీటిపారుదల రంగానికి సరైన నిధులు, విధులు నిర్వహించుకోవడం వల్ల చివరి ప్రాంతాలకు నీరంధక, మరికొన్ని చోట్ల వరినాట్లు వేయడం మానేశారన్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరున్నర లక్షల […]

WhatsApp Image 2023-11-03 at 7.00.16 AM Kakinada

కాకినాడ స్మార్ట్‌ సిటీలో 10,000కు పైగా వీధి శునకాలున్నాయి… -కమిషనర్‌ నాగ నరసింహారావు-

కాకినాడ నగరపాలక సంస్థలో 10,000 పైగా వీది కుక్కలున్నట్టు ఇంచార్జి కమిషనర్‌ నాగ నరసింహారావు తెలియజేశారు. వీటికి ఏఆర్‌వీ వేక్సిన్‌ వేసే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై మున్సిఫల్‌ హెల్త్ ఆఫీసర్‌ డాక్టర్‌ పృద్వీచరణ్‌ తదితరులతో ఆయన సమీక్షించారు. వీధి శునకాలకు ఎఆర్వీలను వేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఎనిమిది బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

WhatsApp Image 2023-11-02 at 9.49.54 PM Trending News

ఆంబోతు దాడిలో అయిదుగురికి తీవ్ర గాయాలు

సామర్లకోటలో ఒక ఆంబోతు బీభత్సం సృష్టించింది. కనబడిన వారందరిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని వీర్రఘవపురంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక ఆబోతు వీధుల్లోకి ప్రవేశించింది. రోడ్డుపై పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలు, బలుసులపాటకు చెందిన ఒక న్యాయవాది పెయ్యల చక్రవర్తి తో పాటు దారిన వెళుతున్న మరి ముగ్గురిపై అతి దారుణంగా దాడిచేసింది. ఆదాడిలో అయిదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దాడిలో వారు తీవ్రంగా […]

WhatsApp Image 2023-11-01 at 8.37.59 PM Trending News

మధ్యాహ్న బోజనాన్ని పరిశీలించిన ఆహార కమిషన్ సభ్యుడు …

ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ కాకినాడ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో బాగంగా జెడ్పీ హై స్కూల్ కొవ్వాడలో మిడ్ డే మీల్స్ ని పరిశీలించారు. కోడి గుడ్లు నిల్వ ఉండడం గమనించిన ఆయన వాటిని రిటర్న్ చేసి, కొత్త స్టాక్ రపించమని DEO ని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనము చేశారు. రామారావు పేటలో UPHC లో జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము లో పాల్గొని, అనంతరం పలు అంగన్వాడీ సెంటర్లను […]

WhatsApp Image 2023-11-01 at 6.44.48 PM Education / Career

జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ను జయప్రదం చేయండి….

జిల్లా స్థాయి 31 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2023 ఈ నెల 9, 10 తేదీలలో కాకినాడ లో ఎమ్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారిణి జి. నాగమణి ఒక ప్రకటన లో తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతికండలి మరుయు పాఠశాల విద్యాశాఖ అధ్యర్యం లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం బాలల సైన్స్ కాంగ్రెస్ గోడ పత్రిక ను తన కార్యాలయం లో ఆవిష్కరించారు. […]

IMG-20231030-WA0010 Education / Career

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మారై స్కానింగ్ ఏర్పాటు చేయాలి… – సి.ఎస్.ఆర్.ఎం.ఓ. కు వాసంశెట్టి వినతి-

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిమిత్తం అధిక శాతంలో పేదలు హాజరవుతారని అక్కడ అవసరమైన ఎమ్మారై స్కానింగ్ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీ.సీ. ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు ఆసుపత్రి సి.ఎస్.ఆర్.ఎం.ఓ. పుష్కరరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ… కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాదిమంది రోగులు వివిధ వైద్య సేవల నిమిత్తం వస్తుంటారని అక్కడ అవసరమైన ఎమ్మారై స్కానింగ్ మూడున్నర సంవత్సరాల […]