Screenshot_20231127_161826 Culture

కాకినాడ భోగిగణపతి పీఠంలో ఘనంగా జరిగినసైకత శివలింగార్చన…

శోభకృత్ కార్తీకమాస ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని కాకినాడ భోగిగణపతి పీఠంలో సైకతశివ లింగానికి సహస్రనామ పారాయణతోప్రత్యేకపూజాధికాలు చేశారు. ముందుగా 808వ గణపతిజప యజ్ఞంలో పంచామృతాభిషేకం జరిగింది. పీఠంలో స్వయంభువుకి కవచ థారణ, తిరుమల శ్రీవారి పాదుకల ప్రతిష్ట సందర్భంగా శివకేశవ ఆరాధనతో చేపట్టిన 8 వారాల అన్నసమారాధనను రెండవ సోమవారం నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… కార్తీక మాసంలో శివకేశవ ఆరాధన జరగడం లోక కల్యాణకారకమన్నారు. […]

IMG-20231126-WA0007 Exclusive

27 న స్పందన, డయల్ యువర్ కమిషనర్… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు వెల్లడి-

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. స్థానిక సమస్యలను కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఫోన్ నెంబర్ 08842357800 కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చనీ ఆయన అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ […]

IMG_20231123_165243 Kakinada

ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు లేవు… -కాకినాడ సిటీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్-

కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు అవకాశం లేకుండా పారదర్శక పద్ధతిలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నివేదిక రూపొందిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహరావు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే బీ.ఎల్.ఓ. లు ద్వారా సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇంటింటా ఓటరు వివరాలు సేకరిచడం వారి పేర్లను ఓటరు జాబితా లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. […]

WhatsApp Image 2023-11-21 at 10.45.32 AM Kakinada

కాకినాడ తీరంలో తిరగబడ్డ ఫైబర్‌ బోటు

కాకినాడ జల్లా కాకినాడ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రం లోకి చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు ఫైబర్‌ బోటు బోల్తాపడింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు అయ్యారు. సూర్యరావు పేట నుండి హోప్ ఐలాండ్ వద్దకు ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్ళారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా కెరటాల దాటికి తెప్ప తిరగబడి ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా వొడ్డికి వచ్చారు. గల్లంతయిన వారిలో… దుమ్ముల పేటకు చెందిన మైలపిల్లి కృపదాసు,సూర్యరావు […]

IMG-20231119-WA0012 Kakinada

పంతం నానాజీ ఆధ్వర్యంలో వన సమారాధన

జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇంచార్జ్, PAC సభ్యులు పంతం నానాజీ  ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో 3వ కార్తీక వన సమారాధన మహోత్సవం కాకినాడ రూరల్ కిరణ్ కంటి ఆసుపత్రి సమీపంలో గల మామిడి తోటలో జరిగింది. ఈ ఆత్మీయ సమావేశ వన సమరాధనలో 20 వేల మంది పాల్గొన్నారు. ఉదయం పూజ కార్యక్రమంతో మొదలై, ఆట పాటలతో, అతిదుల ప్రసంశలతో, ఎంతో ఘనంగా జరిగింది, విజేతలకు (ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రో […]

WhatsApp Image 2023-11-17 at 6.44.22 PM Political

కార్మిక వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు… – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి-

కార్మిక వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, హూపర్ టిప్పర్ వాహన డ్రైవర్లు సమన్వయంతో అందించిన మెరుగైన సేవలే దేశవ్యాప్తంగా కాకినాడకు గుర్తింపును తెచ్చి పెట్టాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక డి- కన్వెన్షన్‌లో కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 225 మంది వాహన డ్రైవర్లు, పారిశుద్ధ్యకార్మికులు, నైట్ శానిటేషన్ వర్కర్లకు ఎమ్మెల్యే ద్వారంపూడి దుస్తులు పంపిణీ చేశారు .

IMG-20231117-WA0018 Kakinada

త్వరలో వినియోగంలోకి కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌…

కాకినాడ కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ఈ ఫ్లై ఓవర్‌కు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ వారధిగా నామకరణం చేసినట్టు తెలియజేశారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులుతోపాటు అనుసంధానంగా చేస్తోన్న జంక్షన్‌ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.

WhatsApp Image 2023-11-16 at 7.11.43 PM Kakinada

ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించిన తంగెళ్ళ…

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామ శివారు వుప్పర గూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన తాటాకు ఇళ్ళు దగ్ధమై సుమారు రూ. 30 లక్షల ఆర్థిక నష్టం సంభవించింది. ఈ ఘటనతో నిరాశ్రయులైన తొమ్మిది కుటుంబాల వారిని పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పరామరిశించారు. నిరాశ్రయులైన వారికి బియ్యం, నగదు అందజేశారు. బాధితులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా వుంటుందని అధైర్య పడవద్దని ఆయన ధైర్యం […]

IMG-20231116-WA0018 Kakinada

ఆటోను ఢీకొన్న కార్ 5గురికి గాయాలు…

సామర్లకోట-కాకినాడ ప్రధాన రహదారిలో మామిల్లదొడ్డి వంతెన సమీపాన అయిదుగురు ప్రయాణికులతో కాకినాడ వెళుతున్న ఆటోను కాకినాడ నుంచి పెద్దాపురం వెళుతున్న వేగనార్ కారు అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. కేసుసామర్లకోట పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

IMG-20231114-WA0006 Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన 14, 15 సర్కిల్స్ పరిధిలోని శాంతినగర్, కొత్త కాకినాడ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం, పండుగ సెలవుల నేపథ్యంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన కోరారు. కొన్నిచోట్ల బాణాసంచా వ్యర్ధాలు, చెత్త పేరుకు పోవడానికి గుర్తించారు. వెంటనే వీటిని […]