ఉపాధి హామీ పథకం క్రింద ప్రత్యేక నిధులు విడుదల.. -హోంమంత్రి-
కొవ్వూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.) క్రింద మండలానికి 5 కోట్ల చొప్పున నిధులు మంజూరైనట్లు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులను కేటాయించాలని సీ.ఎం. దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందించిందన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్దికి సహకరించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు. జగనన్న ప్రభుత్వం […]
