కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మారై స్కానింగ్ ఏర్పాటు చేయాలి… – సి.ఎస్.ఆర్.ఎం.ఓ. కు వాసంశెట్టి వినతి-
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిమిత్తం అధిక శాతంలో పేదలు హాజరవుతారని అక్కడ అవసరమైన ఎమ్మారై స్కానింగ్ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీ.సీ. ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు ఆసుపత్రి సి.ఎస్.ఆర్.ఎం.ఓ. పుష్కరరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ… కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాదిమంది రోగులు వివిధ వైద్య సేవల నిమిత్తం వస్తుంటారని అక్కడ అవసరమైన ఎమ్మారై స్కానింగ్ మూడున్నర సంవత్సరాల […]

