జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు… -సానా సతీష్ బాబు ఫౌండేషన్-
కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ రూరల్ ప్రాంతంలోని వాకలపుడి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రజలకు బీ.పీ., షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలను ఫౌండేషన్ వైద్యులు ఉచితం చేశారు. అనంతరం వారికి ఆరోగ్య పరిరక్షణ కోసం పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు […]

