మద్యం పాలసీ అవకతవకలపై విచారణ చేపట్టనున్న సీ.ఐ.డీ. …
ఆంధ్రప్రదేశ్ లో గత వై.ఎస్.ఆర్.సీ.పీ. హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం సీ.ఐ.డీ. తో విచారణ జరిపిస్తామని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే సీ.ఐ.డీ. విచారణ ప్రారంభిస్తుందని, విచారణకు సహకరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను నాయుడు ఆదేశించారు. గడిచిన ఐదేళ్లలో ఊహకు అందని అవకతవకలు జరిగాయని ఆరోపించిన ముఖ్యమంత్రి అన్ని వివరాలను సీ.ఐ.డీ. కి సమర్పించాలని అధికారులకు సూచించారు.



