పోలవరం ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం…
పోలవరం సాగునీటి ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. జులై 27న న్యూఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచనుంది. నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదన పెట్టడానికి క్యాబినెట్ తీర్మానం తప్పనిసరి. కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపేందుకు మంత్రి మండలి అత్యవసర […]









