బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామ చేసిన షేక్ హసీనా…
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు పిలుపునిస్తూ.. హింసాత్మక నిరసనల మధ్య ఆమె రాజధాని ఢాకా నుండి బయలుదేరి భారతదేశానికి వస్తున్నట్లు సమాచారం. ఆమె మరియు ఆమె సోదరి సురక్షితమైన ప్రదేశం కోసం ప్రధానమంత్రి అధికారిక నివాసం గణభబన్ నుండి బయలుదేరారని ఏ.ఎఫ్.పీ. కి తెలిపింది. నివేదికల ప్రకారం.. హసీనా వీడియో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలనుకున్నారు, అయితే లక్షలాది మంది నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం వైపు కవాతు చేయడంతో సమయం లభించలేదు.









