నేపాల్‌లో ఘోర విషాదం… నదిలోకి కొట్టుకుపోయిన రెండు బస్సులు…
నేపాల్‌లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర విషాద చోటుచేసుకుంది. మదన్-ఆష్రిత్ హైవేపై భారీ కొండచరియలు విరిగిపడటంతో 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలోకి కొట్టుకుపోయాయి. నేపాల్‌లోని సెంట్రల్ రీజియన్‌లో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో భారీ వర్షాల మధ్య ఈ విపత్తు సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఖాట్మండు నుండి రౌతహత్స్ గౌర్‌కు 24 మంది ప్రయాణిస్తున్న ఏంజెల్ బస్సు వాహనం పై కొండచరియలు విరిగిపడింది. గణపతి డీలక్స్ అనే మరో […]









