బహిరంగ ఛర్చకు సిద్ధమా…!!!
కులవృత్తినే జీవనాధారంగా నమ్మి జీవనం సాగించే మత్స్యకారుల జాతిని అవహేళన చేస్తూ దోపిడీదారులంటూ మాట్లాడిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని కాకినాడ సిటీ టీడీపీ, మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని చోట్ల నిలదీస్తామని, అలాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)ను వ్యక్తిగతంగా విమర్శించడం తగదంటూ వారు హితవుపలికారు.

