జులై 23న 2024-25 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్…
జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగాల్సిన బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ ఉభయ సభలను పిలవడానికి కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదం తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బడ్జెట్ సమావేశ వివరాలను ఎక్స్ లో ప్రకటించారు.









