WhatsApp Image 2023-11-21 at 11.43.24 AM TECH Crime

రూ.40 లక్షల విలువ చేసే 236 సెల్ ఫోన్లు స్వాదీనం

కాకినాడ జిల్లాలో  దొంగలించబడిన 236 సెల్ ఫోన్ లను రికవరీ చేసినట్లు జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దొంగలించబడిన సెల్ఫోన్ లను రికవరీ చేసి వాటి యజమానులకు అందించడం ఇది మూడోసారి అని ఆయన తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 236 సెల్ఫోన్లను పోలీస్ అధికారులు, సిబ్బంది రికవరీ చేసినట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ వివరించారు.

IMG-20231119-WA0005 Crime

బొంత మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన జాతీయకార్యదర్శి పిట్టా వర ప్రసాద్…

దొమ్మేరు గ్రామంలో ఎస్.సి. యువకుడు బొంతు మహేoద్ర (21) ఆయన కుటుంబం వై.ఎస్. ఆర్ పార్టీ కి చెందిన వారు. ఆ పార్టీకి చెందిన ఫ్లక్సీ చింపాడనే అనుమానంతో ఆ పార్టీ నేతలు ఇచ్చిన పిర్యాదు తో కొవ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ దొమ్మేరు వచ్చి మహేంద్రను స్టేషన్ కు తీసుకొని వెళ్లి పోలీసుల స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తీవ్ర మనస్థాపం చెందిన మహేoద్ర గడ్డి మందు తాగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పిట్టా […]

IMG-20231110-WA0008 Crime

కాకినాడలో విద్యార్థిని వదిలిపెట్టిన ఆగంతకులు… -కాకినాడలో విద్యార్థి ప్రత్యక్షం –

కిడ్నాప్ అయిన విద్యార్థి దుర్గా నాని రాత్రి 7 గంటల ప్రాంతంలో కాకినాడలో ప్రత్యక్షమయ్యాడు. విద్యార్థి కిడ్నాప్ ఉదాంతంపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు హల్చల్ చేయడంతో పాటు పోలీసులు అప్రమత్తం కావడంతో కిడ్నాపర్లు విద్యార్ధిని కాకినాడ జే.ఎన్.టీ.యూ. వద్ద వదిలిపెట్టారు. అంతటితో ఆగక విద్యార్థి దుర్గా నాని ని సామర్లకోట మఠం సెంటర్లో దింపాలని “ర్యాపిడో” సంస్థకు చెందిన టూవీలర్ డ్రాపింగ్ ఒక ద్విచక్ర వాహనాన్ని మాట్లాడి అతనికి డబ్బులు చెల్లించి జే.ఎన్.టీ.యూ. వద్దకు పంపించారు. […]

WhatsApp Image 2023-10-30 at 9.44.15 PM Crime

బియ్యం వ్యాపారి హత్య కేసులో ముద్దాయి అరెస్ట్…

సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో బియ్యం వ్యాపారి జల్లిగంపల తాతబ్బాయి హత్య కేసుకు సంబంధించి ముద్దాయి అదే గ్రామం సాలిపేటకు చెందిన తలాటం రాంబాబు(50) ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీ.ఐ కే. దుర్గా ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం బియ్యం వ్యాపారి అతనికి రావాల్సిన బాకీల వసూలు విషయమై గ్రామంలో ఇంటినుంచి బయటకు వెళ్లగా అదే గ్రామంలో ఉంటూ చెడు వ్యసనాలకు గురైన తలాటం రాంబాబు అనేవ్యక్తి వ్యాపారి తాతాబ్బాయిని అతని ఇంటిలోనికి తీసుకువెళ్ళి […]

1000040896 Crime

రహస్యంగా వాషింగ్ మిషన్ లో రూ.100 కోట్లు తరలింపు…

విశాఖ నుండీ విజయవాడ మీదిగా రహస్యంగా రూ.100 కోట్లు హైదరాబాద్ కు తరలిస్తుండగా విశాఖ పోలీసులు పట్టుకున్నారు. వాషింగ్‌ మిషన్‌ను తరలిస్తున్నట్టు ఆటోలో రహస్యంగా నగదు రవాణా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి చేరింది. రంగంలోనికి దిగిన పోలీసులు ఆటోవాలాను అదుపులోనికి తీసుకున్నారు. ఆ వాషింగ్‌ మిషన్‌ సోనో విజన్‌ కంపెనీకి చెందినది కావటంతో ఆ దిశగా సంబంధిత యాజమాన్యాన్ని ఆరా తీస్తున్నారు. అయితే వారు సరైన ఆధారాలు చేపలేకపోతున్నట్టు […]