17-alamuru1 Exclusive

పారిశ్రామిక వేత్త పాపారావును సన్మానించిన గ్రామ పెద్దలు…

తూర్పూ గోదావరి జిల్లా కలవచర్ల గ్రామంలో సీతారామ ఆలయ వార్షకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ వ్యాపారవేత్త, మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు ఉత్సవ కమిటీకి రూ. 40 వేల రూపాయిలు విరాళంగా అందించారు. అనంతరం స్వామివారిని దర్శంచినారు. తొలత గ్రామ పెద్దలందరూ ఆయనకి ఘన స్వాగతం పలికారు. పూల మాలలు వేసి షాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

R (8) Exclusive

ఆశావర్కర్ల అరెస్టుల పై స్పందించిన పౌర సంక్షేమ సంఘం…!!!

ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆశావర్కర్లు కనీస వేతనం, వేతనం తో కూడిన మెటర్నిటీ సెలవులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు, సిబ్బందిని పెంచి పని భారం తగ్గించాలన్న విధానపరమైన డిమాండ్లతో శాంతి యుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు వ్యవహరిస్తున్న శైలి మంచిది కాదని పౌర సంక్షేమ సంఘం హెచ్చరించింది. నిరసనకు సిద్దమైన వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్న ప్రభుత్వ వైఖరి సక్రమం కాదని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల […]