sbsn Political

చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతం రాష్ట్రం గురించే ఆలోచన చేస్తారని అన్నారు. రాజకీయ ఒత్తిళ్ళు, వేధింపులు ఎన్ని ఎదురైనా ధృడ చిత్తంతో ఎదుర్కొంటారన్నారు. వై.సీ.పీ. సర్కార్ బనాయించిన కేసులతో కారాగారంలో ఉన్నప్పుడూ కూడా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదన్నారు. పరిపాలన పటిమతో […]

WhatsApp Image 2024-04-18 at 6.22.26 PM Political

జనసేనలోకి చేరిన వట్టి పవన్ కుమార్…

మాజీ మంత్రి, దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ ను గురువారం మంగళగిరిలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా వేసీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కుమార్ తో పాటు ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కాటి కిరణ్ అలాగే వై.సీ.పీ. సీనియర్ నాయకులు మంద శ్రీనివాసరెడ్డి, తదితర నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్బంగా ఆయన […]

chandrababu-naidu-1548839707 Political

రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం వస్తుంది… -టీడీపీ అధినేత-

జూన్ 4 తర్వాత ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కచ్చితంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం పెడన, మచిలీపట్నంలో జరిగిన ప్రజా గళం సభల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నాయుడు, ఈ జగనాసురని ఎలా వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికల సర్వేలన్నీ […]

be725fd4-9d73-4f3e-a4c2-314c71ae0b45 Crime

వై.సీ.పీ. నుంచి తోట త్రిమూర్తులు ను తొలిగించాలి…

మండపేట నియోజకవర్గంలో వై.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులకు దళిత యువకులను శిరోమండలం చేయించిన కేసులో నేరం రుజువు కావడంతో 18 నెలలు జైలు శిక్ష, రూ. 2.50 లక్షలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనితో సదరు తోట త్రిమూర్తులను వై.సీ.పీ. పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జే.ఎస్.పీ. కార్యదర్శి, దళిత సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టా జానకి రామారావు డిమాండ్ చేశారు. అలాగే దళిత యువకుడును […]

WhatsApp Image 2024-04-16 at 5.14.38 PM Exclusive

శిరోమండనం తీర్పు పై పిట్టా వరప్రసాద్ హర్షం వ్యక్తం…

దళితుల ఆత్మగౌరవం నిలిపిన తీర్పు. 28 సంవత్సరాల తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వెంకటాయపాలెం శిరోమండన బాధితులకు న్యాయం జరిగింది. 1996 డిసెంబర్ 26న దళిత యువకులకు శిరోమండనం చేయించిన ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్ట్ 18 నెలల జైలు, రెండు లక్షలు యాబై వేలు జరిమానా విధించడం పట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్, పార్టీ రాష్ట్ర కమిటీ […]

maxresdefault (6) Political

తెనాలి బహిరంగ సభలో జగన్ పై పవన్ ఆగ్రహం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ఆయనకు అహంకారం, అహంకారంతో కూడిన వ్యక్తిగా అభివర్ణించారు. వారాహి విజయ భేరిలో భాగంగా ఆదివారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ.. హద్దురాళ్లు, పట్టాదార్‌ పాసుపుస్తకాలపై కూడా జగన్‌ బొమ్మ ఉండడం ఆయన అహంకారాన్ని తెలియజేస్తోందన్నారు. ఆయన వర్గ పోరు గురించి మాట్లాడుతున్నారని, ఎవరు భూస్వామ్య వాదో ప్రజలకు బాగా తెలుసన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ఎన్నికలు చాలా […]

if-this-jungle-law-continues-jsp-tdp-bjp-must-unite_b_1605210844 Political

నార్త్‌ వైజాగ్ లో రోడ్‌షో నిర్వహించిన త్రైపాక్షిక కూటమి…

విశాఖపట్నం టీ.డీ.పీ. లోక్‌సభ అభ్యర్థి ఎం. శ్రీభరత్ అక్కయ్యపాలెంలో వైజాగ్ నార్త్ బీ.జే.పీ. అభ్యర్థి పి. విష్ణుకుమార్ రాజుతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీభరత్ తన ప్రసంగిస్తూ… వై.ఎస్‌.ఆర్‌.సి. ప్రభుత్వ అసమర్థత కారణంగా విశాఖపట్నానికి మంజూరైన అనేక కేంద్ర ప్రాజెక్టులు మెటీరియలైజ్ కాలేదని ఎత్తిచూపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విశాఖపట్నం రైల్వే జోన్, మెట్రో రైలు ప్రాజెక్టు, ఐ.టీ., పారిశ్రామిక రంగాలు, టూరిజం అభివృద్ధిని విస్మరించిన విషయాన్ని ఆయన గుర్తుచేసారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్‌.డి.ఏ. […]

WhatsApp Image 2024-04-14 at 4.59.30 PM Political

కోడి కత్తి డ్రామాను మరోసారి తలపిస్తున్నాయని… -బీ.జే.పీ.-

మేమంతా సిద్ధం పేరుతో వైయస్సార్ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి విజయవాడలో ఉండగా రాయి తగిలి ఆయన నుదుటిపై గాయమయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై వస్తున్న వార్తలు తదుపరి పరిణామాలు కోడి కత్తి డ్రామాను మరోసారి తలపిస్తున్నాయని బీ.జే.పీ. పార్టీ సీనియర్ నేత నరసాపురం ఇన్చార్జి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఐ ప్యాక్ ఎన్నికల వ్యూహ కర్తగా పని […]

WhatsApp Image 2024-04-13 at 9.59.04 PM Political

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో జగన్ పై దాడి…

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సుయాత్రలో విషాదం చోటుచేసుకుంది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు రాయితో దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు ఈ రాయి తాకడంతో జగన్ కి తీవ్ర గాయం అయ్యింది. అతని పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు వై.సీ.పీ. నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని పక్కనే ఉన్న ఎం.ఎల్.ఏ. వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయం అయ్యింది. వెంటనే జగన్ కు బస్సులో ప్రథమ […]

OIP (29) Crime

బాపట్లలో కలకలం రేపుతున్న గుర్తుతెలియని మృతదేహం…

బాపట్ల జిల్లలో తల లేని మృతదేహం కలకలం రేపింది. చీరాల మండలం ఈపూరుపాలెంలో ఓ వ్యక్తి కొత్త ఇంటికి అవసరమైన ఇసుక లోడ్ ను తీసుకొని వచ్చాడు. అయితే ఆ లోడు దించే సమయంలో అందులో నుంచి తల లేని ఒక మృతదేహం కింద పడింది. దానితో అక్కడున్నవారంతా భయానికి లోనయ్యారు. గుర్తుతెలియని వ్యక్తి శవమై కనిపించడంతో ఆ మృతికి ఇసుక మాఫియా నే కారణమని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జరిగిన ఘటనకు గల కారణాలు తెలియాల్సి […]