వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర…
భారీ వర్షాల కారణంగా శనివారం పవిత్ర గుహ వరకు పహల్గాం మరియు బల్తాల్ మార్గాల నుండి అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంభందిత అధికారులు వెళ్లడించారు. పవిత్ర గుహ మరియు సమీప ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది, ట్రాక్‌లు జారేవిగా తెలిపారు. ఈ పవిత్ర క్షేత్రం సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుందని వారు తెలిపారు. ఈ సంవత్సరం యాత్రకు 3.50 లక్షలకు పైగా భక్తులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

