WhatsApp Image 2024-04-13 at 4.39.56 PM Konaseema

కుల వివక్షతో దూరం పెడుతున్నారు…!!!

దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఓవైపు రాజకీయ నేతలు చెబుతూ ఉంటే మరోవైపు ఇంకా అంటరానితనం సాంఘిక బహిష్కరణ వంటి అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ దళిత కుటుంబం తమ ఇంటికి వెళ్లేందుకు దారిలేకుండా చేసి తమను వేదిస్తూ అగ్ర కులాలవారు కుల వివక్ష చూపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే… అమలాపురం మెయిన్ రోడ్డు కి సమీపంలోని ఏడిద చక్రధర్ నగర్ లోని ఓ రోడ్డు వ్యవహారం […]

WhatsApp Image 2024-04-12 at 5.09.21 PM Political

నా పై ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజకీయ సన్యాసం చేస్తా… -పినిపే విశ్వరూప్-

నా మీద చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటామని వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి, అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమవేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ… తాను ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా పని చేశానని, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తానని సుమారు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 64 ఎకరాలు సేకరించానని ఎవరి దగ్గర వంద రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పారు. […]

WhatsApp Image 2024-04-03 at 3.48.44 PM Konaseema

సచివాలయం వద్ద కుప్ప కూలిపోయిన వృద్ధుడు…!!!

పెన్షన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు సచివాలయం వద్ద కుప్ప కూలిపోయిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… అమలాపురంలోని పోస్టల్ కాలనీ వద్దగల పేరూరు సచివాలయం 4 వద్దకు పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన కొంకాపల్లి కి చెందిన కురసాల నరసింహంమూర్తి కూర్చునేందుకు స్థలం లేక ఉదయం నుండి ఎండలో నిలబడి ఉన్నాడు. 10 గంటలకు సచివాలయానికి వచ్చిన సిబ్బంది పెన్షన్ గురువారం ఇస్తామని చెప్పడంతో ఆందోళన కు గురైన వృద్ధుడు […]

WhatsApp Image 2024-03-30 at 8.59.48 AM Konaseema

చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలి… -అయితా బత్తుల-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన, తెలుగుదేశం ఆత్మీయ సమావేశంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయితా బత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం అభ్యర్థిగా తాను చేసిన సేవలను చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీ.జే.పీ. పార్టీ గుర్తించాయని చెప్పారు. పార్టీ అధికారంలో లేకపోయినా గత ఐదు సంవత్సరాలుగా తనకి జనసేన కార్యకర్తలు ఎంతో సహకారం అందించారని, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తనని ప్రకటించారని ఆనందం […]

9545a74f-ef62-4dc0-9990-198616b94c21 Konaseema

అమలాపురం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పరమట శ్యామ్ కుమార్…

అమలాపురంలో మళ్ళీ 2024ఎన్నికలు రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా అంటే అవుననే అమలాపురం నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో తనకంటూ సొంత ఓటు బ్యాంక్ ఉన్న పరమట శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చివరి నిమిషములో టి.డి.పి. టికెట్ చేజారిపోవడంతో ఖచ్చితంగా 2024లో న్యాయం జరుగుతుందని శ్యామ్ కుమార్ వర్గీయులు ఆశించారు. కానీ ఈ సరికూడా న్యాయం జరగకపోవడంతో […]

WhatsApp Image 2024-03-21 at 9.30.58 PM Political

బీ.జే.పీ. లోకి చేరిన అమలాపురం వై.సీ.పీ. ఎం.పీ భర్త…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకావడంతో అమలాపురంలో రాజకియాలు రసవత్తరంగా మారుతున్నాయి. అమలాపురం వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. చింతా అనుదాధ భర్త టీ.ఎస్.ఎన్. మూర్తి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. దానితో అమలాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్బంగా బీ.జే.పీ. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. ఆయన పి.గన్నవరం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.

WhatsApp Image 2024-03-03 at 5.55.14 PM Political

ఉమ్మడి నిర్ణయాన్ని గౌరవిస్తాం…

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించకపోడంపై సర్వత్రా సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు సమావేశమై వారి వారి ఆవేదనను వ్యక్తపరిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు అయితాబత్తుల ఆనందరావుకి సీటీ ఇవ్వాల్సిందిగా వారు సూచించారు.

R Political

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీ.జే.పీ. యాత్ర…

భారత్ జనతా పార్టీ ఈ నెల 21వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ జిల్లాలో ప్రజా పోరు యాత్ర ను నిర్వహించి ప్రజల సమస్యలను తెలికుంటుందని కన్వీనర్ యాళ్ల వెకటేశ్వర రావు అమలాపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో వెళ్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, అభివృద్ధి నిరోధక కార్యక్రమాలపై నిలదీసేందుకే ఈ ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరూ […]

WhatsApp Image 2024-02-17 at 8.56.45 PM Konaseema

అమలాపురంలో టీ.డీ.పీ. శంఖారావం యాత్ర…

ఆంద్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం తాండపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు అయినాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రతీ ఇంటికీ వెళ్లి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను […]

WhatsApp Image 2024-02-16 at 4.13.21 PM Viral

పలు అభివృద్ది పనులను ప్రరంభించిన మంత్రి విశ్వరూప్…

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దంగేటి బాలమణిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన సంస్కరణలను విద్యారంగంలో ప్రవేశపెట్టి విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేసారన్నారు. దీని ప్రభావంతో చాలామంది సివిల్ సర్వీస్ వంటి ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయని […]