రేషన్ కార్డు దారులకు ఏ.పీ. శుభవార్త…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ పథకం ద్వారా కందిపప్పు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు సరుకు తరలించేలా చర్యలు చేపట్టింది. కేజీ కందిపప్పు రూ. 67 లకు కార్డు లబ్దిదారులకు అందించనున్నట్లు చెప్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేసామని వెల్లడించింది. […]
