భర్తపై కోపంతో కన్న బిడ్డను కడతేర్చాలనుకుంది

అక్రమ సంబంధం నేపద్యంలో కన్న బిడ్డను చిత్రహింసలకు గురిచేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తితో అక్రమ సంబంధంలో కొనసాగుతున్న ఆ మహిళ తన ఐదేళ్ల కుమారుడి శిరస్సును నీళ్ల బకెట్‌లో ముంచి ఊపిరాడకుండా హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఆయువుతో కొట్టుమిట్టాడే క్రమంలో ఆమె చెరనుంచి ఆ బాలుడు తప్పించుకున్నాడు. ఈ సంఘటనను ఆమె ప్రయుడు రాజేష్‌ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. వెంకటరమణ అనే మహిళ మానసిక స్థితి, ప్రవర్తన సక్రమంగా లేకపోడంతో ఆమె […]

పెద్దాపురంలో డ్వాక్రా బజార్

పెద్దాపురంలో నూతనంగా డ్వాక్రా బజార్‌ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలచే తయారు చేయబడిన ఉత్పత్తులు తక్కువ ధరలకే లభించాలన్న ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేశారు. ఈ బజార్‌ను మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ శనివారం ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్ధికంగా ఎదిగేందుకు డ్వాక్రా సంఘాల సమన్వయం దోహదపడుతుందని ఛైర్మన్‌ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ డ్వాక్రా బజార్ ను ప్రారంభించారు.

ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌లపై విచక్షణారహితంగా దాడి చేశారు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు జంక్షన్‌ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లపై దాడికి తెగబడ్డారు. కాలితో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దారు. వయసులో పెద్దవాడని కూడా చూడకుండా విచక్షణారహితంగా నడిరోడ్డుపై దాడిచేశారు. కావలి డిపో నుంచి బస్సు బయటకు వచ్చిన తరువాత, ఆ బస్సు ముందు తమిళనాడు రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ కలిగిన కారు నిలిపి ఉంది. అదే సమయంలో ఒక సైకిల్‌ అడ్డురావటంతో బస్సు డ్రైవర్‌ […]

IMG-20231028-WA0020 Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు ఎమ్. సత్యప్రసాద్, జీఎస్వీ రావు, కెఎస్ఆర్కే చౌదరీలు, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తదితర సీఐ, ఎస్ఐ ల ఆద్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు.

IMG-20231028-WA0016 Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం, ఆదిత్యా విద్యాసంస్థల  ఆధ్వర్యంలో సైబర్ మోసాల అరికట్టడంలో సాంకేతికత పాత్ అనే అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు  నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ (పరిపాలన) పి. శ్రీనివాస్ ఈ పోటీలను పరిశీలించారు. విద్యార్థులకు “లైంగిక వేధింపుల నుండి మహిళలు, […]

IMG-20231028-WA0015 Political

ప్రభుత్వం నిత్యవసర వస్తు ధరలను నియంత్రించలేకపోతోంది – కాకినాడ జిల్లా బీజేపీ నాయకులు-

నిత్యవసర వస్తువుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేక పోతోందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కమిటీ దుయ్యబట్టింది. దరల పెరుగుదలపట్ల అన్ని వర్గాలల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని పార్టీ అభిప్రాయబడింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ కుమార్ అధ్యక్షతన పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సమావేశం తీర్మాణించింది. ఉద్యోగులకు జీతాలు లేవని, నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతోందని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, […]

నవంబర్‌ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌

విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్లపూ భారత విద్యార్ధి ఫెడరేషన్‌ నవంబర్‌ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థలు బంద్ కు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి వాల్‌పోస్టర్లతో విస్త్రుత ప్రచారం చేపట్టారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో సంప్రదించి బంద్‌ ఆవశ్యకత పట్ల విద్యార్ధులకు అవగాహణ కల్పిస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం పావులుకదుపుతున్న నేపద్యంలో, జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేయటం పట్ల విద్యాసంస్థల […]

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉన్నాం

చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ అన్నారు. 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్‌ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ జరుగుతుందని తెలియజేశారు. జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్‌ ఉన్నాయని, బీపీఓ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. ప్రతీ గంటకు గార్డ్‌ సెర్చ్‌ చేస్తున్నారని, ఈనెల 22వ తేదీన జైలు వాటర్‌ ట్యాంక్‌ వైపు ఒక డ్రోన్‌ తిరిగిందని నార్త్‌ఈస్ట్‌ వాచ్‌టవర్‌ గార్డు నుంచి మాకు సమాచారం వచ్చిందన్నారు. మావోల […]

కడప ప్రొద్దుటూరులో కత్తులతో దాడి… వైఎస్‌ఆర్‌సిపీ అనుచరుడు బెనర్జీకి గాయాలు

కడప జిల్లా ప్రొద్దుటూరు మెడినోవా ఆసుపత్రి సర్కిల్ ప్రధాన రోడ్డు పై శనివారం మధ్యాహ్నం రెండు వర్గాలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుచరుడు బెనర్జీ కి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఇరువర్గాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐ నరసయ్యకు గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బెనర్జీ సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సమన్వయంపై సర్వత్రా ఆసక్తి

తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ సమావేశం పట్ల రాజకీయ విశ్లేషకులు సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు. 29న కాకినాడలో జరగనున్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో రాబోయో ఎన్నికలకు ఏ నిర్ణయాలు తీసుకోనున్నారనే సందిగ్ధం నెలకొంది. ఈ నేపద్యంలో ఇరుపార్టీల రాష్ట్ర నాయకులు, జిల్లా, మండల స్థాయి నాయకులు కాకినాడ సాంబమూర్తినగర్‌లోని విఎస్‌ఎల్‌ ఫంక్షన్‌ హాల్లో ఆదివారం సమావేశం కానున్నారు. సీట్ల సర్ధుబాటు విషయంలో రెండు పార్టీలు ఓ ఒప్పందానికి రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.