వైద్య పరీక్షలకు హైదరాబాద్‌ వెళ్తున్న చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు . స్కిల్‌ స్కామ్‌ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయనకు ఆరోగ్య కారణాలతో హైకోర్టు కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలైన ఆయన ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానుల విజయోత్సవాల నడుమ 13 గంటల ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నారు. బుధవారం వైద్యం నిమిత్తం […]

IMG-20231031-WA0017 Political

విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి… – బీజేపీ మహిళా మోర్చా డిమాండ్-

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జరుగుతున్న అక్రమాలను ఎత్తి చూపినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎం.పీ. విజయ సాయి రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ” పురందేశ్వరి మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు – కానీ నేను మద్యం సేవించను” అని అవమానకరంగా మాట్లాడటం సిగ్గు చేటని మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న దుయ్యబట్టారు. మహిళల పట్ల వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ […]

IMG-20231031-WA0018 Trending News

కాకినాడ జిల్లా డీపీవో గా భారతి సౌజన్య…

కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి(డీ.పీ.వో.)గా నూతనంగా నియమితులైన కే. భారతి సౌజన్య  జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కాకినాడ, కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియలను మర్యాదపూర్వకంగా కలిశారు. 2022 గ్రూప్-1 పరీక్షలో డీ.పీ.వో. గా ఎంపికైన భారతి సౌజన్య నెల్లూరు జిల్లాలో ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా డీ.పీ.వో. గా ఆమెను […]

images (9) Political

రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి…

రైలు ప్రమాదం లో గాయపడిన వారికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి సర్వజన ఆసుపత్రి లో బాధితులకు స్వయంగా కోటి 2 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి బాధితుని వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పరిహారాన్ని అందజేస్తున్నాని చెప్పి, పూర్తిగా కోలుకున్న తర్వాతనే వైద్యుల సలహా మేరకు ఇంటికి వెళ్ళాలని చైర్మన్ తెలిపారు. మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారని అన్నారు. […]

IMG-20231031-WA0010 Trending News

తాళ్లూరు లిఫ్ట్ ద్వారా నీరందక 31 వేల ఎకరాలకు నష్టం… -టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెహ్రూ-

పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లూరు లిఫ్ట్కి సంబంధించి 31 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులకు భారీ నష్టం కలిగిందని తక్షణమే ఆ పంటలకు నష్ట పరిహారం ఇప్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) వినతిపత్రాన్ని అందించారు. పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్లూరుకు సంబంధించి ప్రెజయిర్ పాడవడం వల్ల సాగునీరు సరఫరా జరగలేదన్నారు. ఈ సమస్యను తాను […]

IMG-20231031-WA0009 Political

ఇసుకలో 2000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు… -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి-

ఇసుక విషయంలో పాలకులు ఏవిధంగా జేబులు నింపుకుంటున్నారన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియకు వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇసుక వ్యవహారాన్ని లేవనెత్తి గణాంకాలతో సహా ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తూ ఇసుక వ్యవహరంలో నైనా ప్రభుత్వం సమాధానం చెబుతుందా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనంతమైన సహజవనరులు ఉన్న రత్నగర్భ , నదీ నదాలు ఓడరేవులు సువిశాలమైన సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రమన్నారు. భవన నిర్మాణానికి కావలసిన ఇసుక […]

104 ఏళ్లుగా కార్మిక హక్కులకై అలుపెరుగని పోరాటం

ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కాకినాడ ప్రభుత్వ సామాన్య హాస్పిటల్ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఏఐటీయూసీ 14వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రాంచ్ అధ్యక్షుడు కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. సోంబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ముంబైలో […]

చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిల్‌ మంజూరు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో గత 50 రోజులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ను మంగళవారం జారీ చేసింది. చంద్రబాబునాయుడు అరెస్టు అయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ప్రత్యేక షరుతులపై ఇంటి వద్దనే చికిత్స పొందేందుకు కోర్టు ఈ బెయిల్‌ మంజూరు చేసింది. పార్టీ సమావేశాల్లో పాల్గొనరాదని, నాయకులతో […]

WhatsApp Image 2023-10-30 at 9.44.15 PM Crime

బియ్యం వ్యాపారి హత్య కేసులో ముద్దాయి అరెస్ట్…

సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో బియ్యం వ్యాపారి జల్లిగంపల తాతబ్బాయి హత్య కేసుకు సంబంధించి ముద్దాయి అదే గ్రామం సాలిపేటకు చెందిన తలాటం రాంబాబు(50) ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీ.ఐ కే. దుర్గా ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం బియ్యం వ్యాపారి అతనికి రావాల్సిన బాకీల వసూలు విషయమై గ్రామంలో ఇంటినుంచి బయటకు వెళ్లగా అదే గ్రామంలో ఉంటూ చెడు వ్యసనాలకు గురైన తలాటం రాంబాబు అనేవ్యక్తి వ్యాపారి తాతాబ్బాయిని అతని ఇంటిలోనికి తీసుకువెళ్ళి […]