WhatsApp Image 2023-11-03 at 6.25.46 AM Trending News

రైలు గేట్ ను ఢీకొన్న లారీ కంటైనర్…

సామర్లకోట మండలం మాధవపట్నం సమీపాన సర్పవరం రైలు గేట్ ను లారీ కంటైనర్ వేగంగా ఢీకొనడంతో గేట్ విరిగిపోయింది. ఫలితంగా గేట్‌ సాంకేతిక లోపానికి గురయ్యి సిగ్నలింగ్ వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రైల్వే అధికారులు గేట్ పునర్నిర్మాణ పనులు చేపట్టారు

WhatsApp Image 2023-11-02 at 10.00.15 PM (1) Trending News

కాకినాడ ఆసుపత్రిలో ఎమ్మారై ప్రారంభం …

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.11.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఎమ్మారై యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్ ను జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల ప్రారంభించగా, ఎం.పీ. వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ… ప్రభుత్వం వైద్యమును పేదలకు కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మారై యూనిట్ ఏర్పాటు చేసిందన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పేదలకు మెరుగైన […]

Ration Door Delivery Program Photo Gallery_34 Crime

సామర్లకోటలో ఫుడ్ కమిటీ సభ్యులు విస్తృత తనిఖీలు…

రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యుడు జక్కంపూడి కిరణ్ సామర్లకోటలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా కాకినాడ జిల్లాలో వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. సామర్లకోటకు విచ్చేసిన ఫుడ్ కమిటీ సభ్యులు సాయి నగర్ లోనూ, సంపంగి తోట ప్రాంతాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశారు. సాయి నగర్ లో రేషన్ డీలర్ యజమాని ప్రజల నుంచి బయోమెట్రిక్ తీసుకుని సరుకులు సకాలంలో అందించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై చైర్మన్ […]

WhatsApp Image 2023-11-02 at 9.53.08 PM Political

గృహ నిర్మాణాలపై మంత్రి సమీక్ష…

  నిర్మాణ్ భవన్ లో అన్ని జిల్లాల హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల తో గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్, ఆంధ్రరాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ వై.ఎస్. ఆర్ సీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు, ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ సమావేశమై గృహ నిర్మాణ కార్యక్రమంపై చర్చించారు. ఇంకా నిర్మాణంలో ఉన్న దృహాలను త్వరగా పూర్తి చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

WhatsApp Image 2023-11-02 at 9.50.42 PM Political

బాబుతోనే రాష్ట్ర భవిష్యత్… -ఎమ్మెల్యే నిమ్మకాయల రంగనాథ్-

రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప తనియుడు నిమ్మకాయల రంగనాథ్ అన్నారు. సామర్లకోట పట్టణం ఆరో వార్డులో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ”కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారేదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ… త్వరలో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, మినీ […]

WhatsApp Image 2023-11-02 at 9.49.54 PM Trending News

ఆంబోతు దాడిలో అయిదుగురికి తీవ్ర గాయాలు

సామర్లకోటలో ఒక ఆంబోతు బీభత్సం సృష్టించింది. కనబడిన వారందరిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని వీర్రఘవపురంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక ఆబోతు వీధుల్లోకి ప్రవేశించింది. రోడ్డుపై పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలు, బలుసులపాటకు చెందిన ఒక న్యాయవాది పెయ్యల చక్రవర్తి తో పాటు దారిన వెళుతున్న మరి ముగ్గురిపై అతి దారుణంగా దాడిచేసింది. ఆదాడిలో అయిదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దాడిలో వారు తీవ్రంగా […]

IMG-20231102-WA0002 Trending News

జీజీహెచ్ లో అమాంతంగా కూలిన చెట్టు….

జీజీహెచ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, ఎం.పీ. వంగ గీతా విశ్వనాధ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖులు బయటకు రాగానే ఓ.పి. బ్లాక్ మెడికల్ వార్డు మధ్య లో భారీ చెట్టు అకస్మాత్ గా కూలిపోయింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, ఎం.పీ. వంగ గీతా విశ్వనాధ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ బయటకు రాకముందే చెట్టు కూలడంతో […]

నాడు అమరజీవి త్యాగఫలం … నేడు స్వేచ్ఛా సంకల్పం

అమ‌ర‌జీవి శ్రీ పొట్టిశ్రీరాములుగారి త్యాగ ఫ‌లం, ఎంతో మంది పోరాట ఫ‌లితంగా తెలుగువారికి ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డింది. నేడు వారి స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబంలో సంక్షేమం, అభివృద్ధి అందించాల‌న్న స‌మున్న‌త ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌లుగా మ‌నం బ‌ల‌ప‌డుతూ ఈ దేశాన్ని మ‌రింత బ‌ల‌ప‌రిచేందుకు ఎన్నో అడుగులు ముందుకు వేస్తున్నాం. దేశ అభివృద్ధిలో మ‌న‌వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నాం. నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ రాష్ట్ర […]

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలైన సందర్భంగా గుంతకల్లు రూరల్ మండలం కసాపురం ఆంజనేయస్వామి దేవాలయంలో ఆకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో […]

ప్రాణం తీసిన క్షణికావేశం, 6వ తరగతి విద్యార్థి మృతి

అనంతపురము జిల్లా కుందుర్పి మండలం కనగానపల్లిలో ఆరో తరగతి చదువుతున్న బొమ్మలింగ అనే విద్యార్ధి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బొమ్మలింగ బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తూ తన తల్లిని రెండు రూపాయలు అడిగాడు. ఉదయం ఇంటర్వెల్‌ సమయంలో తినుబండారాలు కొనుక్కునేందుకు ప్రతిరోజు తీసుకువెళ్తుంటాడు. అయితే అతడి తల్లి చిల్లరకోసం ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి ఇంటి సమీపంలోనే తాడుతో ఉరివేసుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి కుటుంభ సభ్యులు, స్థానికులు నిశ్చేష్టులయ్యారు. ఆరవ తరగతి వయసులోనే […]