IMG-20231104-WA0016 Political

విలసవిల్లి గ్రామం లో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…..

ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పినిపే విశ్వరూప్ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ లబ్ధిదారులతో మమేకమవుతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి దంగేటి డోలమణి రుద్ర, జడ్పిటిసి గెడ్డం సంపద, సర్పంచ్ సలాది సతీష్ తదితరులు పాల్గొన్నారు

IMG-20231104-WA0002 International

నేపాల్‌లో భూకంపం … 65కి పైగా మృతి

నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది, ఈ ఘటనలో 65 పైగా పౌరులు మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. 6.4 తీవ్రతతో ఇది సంభవించినట్టు తెలుస్తోంది. భారీ నష్టం వాటిల్లిన ప్రాంతానికి 11 మైళ్ల దూరంలో జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అర్థరాత్రి కావటంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు నిద్రలో ఉంటుండగానే మరణించినట్టు తెలుస్తోంది. నేపాల్‌లో సంభవించిన భారీ భూకంప తీవ్రత భారత్‌లోని ఢిల్లీని కూడా తాకినట్టు సమాచారం. స్వల్ప తీవ్రతతో ఏర్పడిన కదలికలకు […]

IMG-20231104-WA0003 National

తమిళనాడులో భారీ వర్షాలు…

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనికి ప్రవేశించడంతో ఈ నెల 5 నుంచి 9వ తేదీల మధ్యలో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ద్రోణి ఉత్తర తమిళనాడు, నెల్లూరు మధ్య తీరంలోనికి ప్రవేశిస్తుంది. అనంతరం తమిళనాడు, కర్ణాటక మీదిగా కదిలి అరేబియా సముద్రంలోని ప్రవేశించి అక్కడ మరింత బలపడి అల్పపీడనంగా మారుతుంది. ఈ నేపధ్యంలో 5 నుంచి 9 తేదీల మధ్యలో తమిళనాడులో […]

IMG-20231103-WA0048 Political

వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం… -మాజీ మంత్రి చిక్కాల-

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతాంగానికి పూర్తిస్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర రావు ఆరోపించారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో చిక్కాల విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వం నీటిపారుదల రంగానికి సరైన నిధులు, విధులు నిర్వహించుకోవడం వల్ల చివరి ప్రాంతాలకు నీరంధక, మరికొన్ని చోట్ల వరినాట్లు వేయడం మానేశారన్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరున్నర లక్షల […]

IMG-20231103-WA0046 Political

కాకినాడ మండలం గొడారిగుంట లో గడప గడప ప్రోగ్రామ్ నిర్వహించిన ఎమ్మెల్యే కన్నబాబు…

కాకినాడ మండలంలో గొడారిగుంట 3వ వార్డ్లో జగనన్న గడప గడప ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ కు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ రూరల్ మాజీ కౌన్సిలర్ వడ్డీ మణికుమర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కన్నబాబు కు మాజీ కౌన్సిలర్ వడ్డీ మణికుమర్ గజ మాలను సత్కరించారు. తదనంతరం గడప గడప ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే కన్నబాబు ఇంటింటికీ వెళ్లి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పధవిలో కి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ప్రజలకు ఎంత మేలు జరిగిందో […]

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ మండల స్థాయి అధికారులకు సూచించారు. 22 మండలాల తాసిల్దార్లు, ఎం.పీ.డీ.వో. లు, మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ అంశాల సన్నద్ధత పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… […]

WhatsApp Image 2023-11-03 at 7.22.09 AM Political

మద్యం టెండర్ల లో చంద్రబాబు తప్పు చేసాడనడం సిగ్గుచేటు…. – కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని-

చంద్రబాబుకు బెయిల్ తధ్యమని తెలియటంతో మద్యం టెండరు లో అవినీతి జరిగిందని కేసు పెట్టారని కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆరోపించారు. అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఇంద్రపాలెం ధర్నా చౌక్, అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలుగు మహిళలు, తెలుగు దేశం బీ.సీ. కమిటీ నాయకులతో నిరసన ధర్నా చేపట్టారు.

WhatsApp Image 2023-11-03 at 7.00.16 AM Kakinada

కాకినాడ స్మార్ట్‌ సిటీలో 10,000కు పైగా వీధి శునకాలున్నాయి… -కమిషనర్‌ నాగ నరసింహారావు-

కాకినాడ నగరపాలక సంస్థలో 10,000 పైగా వీది కుక్కలున్నట్టు ఇంచార్జి కమిషనర్‌ నాగ నరసింహారావు తెలియజేశారు. వీటికి ఏఆర్‌వీ వేక్సిన్‌ వేసే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై మున్సిఫల్‌ హెల్త్ ఆఫీసర్‌ డాక్టర్‌ పృద్వీచరణ్‌ తదితరులతో ఆయన సమీక్షించారు. వీధి శునకాలకు ఎఆర్వీలను వేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఎనిమిది బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

WhatsApp Image 2023-11-03 at 6.39.37 AM Trending News

రూ.70 నుంచి 80కి ఉల్లి పాయే….

వంటకాల్లో ఘాటు రప్పించే ఉల్లిని కోస్తేనే కళ్ల వెంట నీళ్లు వస్తుంటాయనుకుంటారు. దాని ధర విన్నా గుండె గుభేల్‌ మంటుంది. మార్కెట్లో ఉల్లిధర రూ.70 నుంచి రూ.80 కి చేరుకుంది. ఉల్లి ఉత్తత్పత్తి తగ్గడం, రిటైల్‌ మార్కెట్‌లో అందుబాటులో లేకపోడంతో వ్యాపారులు ధరను విపరీతంగా పెంచేశారు. ఇటీవలే ఉల్లి రైతుల్లో కొందరు కోటీశ్వరులైనట్టు వినుంటారు. ఉల్లిపాయల కోసం ఇద్దరు వ్యాపారులను వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తు హత్యచేసిన విషయం విదితమే. ఇలా అనేక సంఘటనలకు, సన్నివేశాలను ఉల్లి […]