IMG-20231116-WA0043 Culture

రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు కిరణ్ రాజ్ ఎంపిక…

రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు సామర్లకోట ప్రగతి స్కూల్ చెందిన సీ.హెచ్. కిరణ్ రాజ్ ఎంపికయ్యాడని ప్రగతివిద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు, నూతలపాటి హిమబిందులు చెప్పారు. చిత్తూరుజిల్లా మదనపల్లిలో ఇటీవల జరిగిన అండర్ 14 విభాగంలో స్కూల్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ పోటీలలో జిల్లా జట్టు విజయం సాధించడంలో కిరణ్ రాజ్ అత్యద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడన్నారు. కిరణ్ రాజ్ ను అభినందించారు.

IMG-20231116-WA0018 Kakinada

ఆటోను ఢీకొన్న కార్ 5గురికి గాయాలు…

సామర్లకోట-కాకినాడ ప్రధాన రహదారిలో మామిల్లదొడ్డి వంతెన సమీపాన అయిదుగురు ప్రయాణికులతో కాకినాడ వెళుతున్న ఆటోను కాకినాడ నుంచి పెద్దాపురం వెళుతున్న వేగనార్ కారు అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. కేసుసామర్లకోట పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

IMG-20231116-WA0006 Exclusive

కడపజిల్లా ట్రిపుల్ ఐటీలో కొండచిలువ కలకలం…

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని బాలుర వసతిగృహం-2 లో భారీ కొండచిలువ కలకలం రేపింది. మంచం కింద నక్కిన కొండచిలువలను అక్కడ ఉన్న విద్యార్థులు గుర్తించి వెంటనే ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం తెలిపారు. ట్రిపుల్ ఐటీ అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి వేంపల్లి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. గది లో మంచం కింద దాగున్న ఆ కొండచిలువను ఫారెస్ట్ అధికారులు గోనె సంచిలో బందింఅడవిలో వదిలిపెట్టారు.

WhatsApp Image 2023-11-15 at 6.44.54 PM Political

ప్రభుత్వం ఇస్తున్న బియ్యం పాస్టిక్ బియ్యంకాదు… -ఆహర కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్-

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని అదనంగా ప్రభుత్వం ధనం వెచ్చించి దేశం ఎక్కడా లేని విధంగా విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి విటమిన్స్ కలిపిన కెన్నాల్స్ ప్రజల ఆరోగ్య కోసం 50కేజిల బియ్యం గాను 500గ్రాముల బియ్యం కలపడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఆహర కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ అన్నారు. వంట వాడినప్పుడు బియ్యం తేలుతాయని అవి మళ్లీ ఎసరులో వేసి వండితే అన్నంలో కరిగిపోతాయని ఆయన […]

Screenshot_20231115_140010 Andhra Pradesh

సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం…

సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో లేబర్ గదిలో ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో లేబర్ గదిలో ఉన్న ప్రిజ్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఫ్రిజ్ పేలడంతో ఒక్కసారి ఆసుపత్రి అంతా పొగలు కమ్మగా ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. హై ఓల్టేజ్ కారణంగా పేలుడు సంభవించిందని చెప్పారు.

IMG-20231115-WA0002 Exclusive

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో 22,000 కు చేరుకున్న దిశా ఆప్ రిజిస్ట్రేషన్….

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిశ మెగా డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎస్.పీ. శ్రీధర్ ఐ.పి.ఎస్., అదనపు ఎస్పీ ఖాదర్ బాషా గార్ల ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాలో దిశ యాప్ మెగా డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా దిశా డి.ఎస్.పీ మురళీమోహన్, అమలాపురం డి.ఎస్.పి. ఎం. అంబికా ప్రసాద్, రామచంద్రపురం డిఎస్పి .టి ఎస్ ఆర్ కే […]

IMG-20231115-WA0004 Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C. రాజమండ్రి వారి ఆదేశాల మేరకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.వి. సత్యవాణి గారి ఆధ్వర్యంలో శిశువును అమలాపురం ఏరియా ఆసుపత్రి నుంచి కాకినాడలో ఉన్న “శిశు గృహా” నకు అప్పజెప్పడం జరిగినది. అలాగే ఈ పాపకు […]

btech-Ravi-696x398-1-696x398 Political

పోలీసుల అదుపులో బీటెక్ రవి…

తేదేపా నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీ.టెక్‌. రవి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపిన. బీ.టెక్‌. రవి ని ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియట్లేదని, తెదేపా శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏ కేసులో రవి ని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారనే దానిపై కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు వాపోయారు.

OIP (9) Weather

మత్యకారులు వేటకు వెళ్లొద్దు

ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతం అయ్యిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఇది వాయువ్య దిశగా పయనించి ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్రవాయుగుండంగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఈ వాయుగుండం శుక్రవారం నాటికి ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకోనుందని చెప్పింది. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి […]

WhatsApp Image 2023-11-14 at 8.37.57 PM Education / Career

శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవం…

 పెద్దాపురం రామారావు పేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో (స్కూలొంపిక్స్) బాలల దినోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రవికుమార్ గారు విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ… పిల్లల్లో ఉన్న వివిధ నైపుణ్యాలను వెలికి తీయడానికి వారి భవిష్యత్ కు బాటలు వేయడానికి ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు దోహద పడతాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సంతానంగారు మాట్లాడుతూ… ప్రతీ విద్యార్ధీ చలికాలం అని […]