WhatsApp Image 2023-11-17 at 6.44.22 PM Political

కార్మిక వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు… – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి-

కార్మిక వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, హూపర్ టిప్పర్ వాహన డ్రైవర్లు సమన్వయంతో అందించిన మెరుగైన సేవలే దేశవ్యాప్తంగా కాకినాడకు గుర్తింపును తెచ్చి పెట్టాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక డి- కన్వెన్షన్‌లో కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 225 మంది వాహన డ్రైవర్లు, పారిశుద్ధ్యకార్మికులు, నైట్ శానిటేషన్ వర్కర్లకు ఎమ్మెల్యే ద్వారంపూడి దుస్తులు పంపిణీ చేశారు .

IMG-20231117-WA0018 Kakinada

త్వరలో వినియోగంలోకి కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌…

కాకినాడ కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ఈ ఫ్లై ఓవర్‌కు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ వారధిగా నామకరణం చేసినట్టు తెలియజేశారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులుతోపాటు అనుసంధానంగా చేస్తోన్న జంక్షన్‌ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.

images (13) Political

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలి… -కొండబాబు –

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమoలో భాగంగా కొండబాబు స్థానిక 39 వ డివిజన్ నందు పర్యటించి ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.

రోడ్లు వేయలేని దుస్తితిలో ప్రభుత్వం

తెదేపా – జనసేన సంయుక్తంగా పెద్దాపురం నియెజకవర్గంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన నియెజకవర్గ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి అధ్వర్యంలో అందోళన చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీకి ఒక్క అవకాశం ఇవ్వడంతో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు పోయిందన్నారు.

బ్రతుకులు చితికిపోతున్నా… చలించని అధికారులు

ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 788 రోజులుగా తమకు న్యాయం చేయమని నినదిస్తున్నారు. అధికారులు ఏ మాత్రం చలించలేదు. కనీసం వారి సమస్య ఏమిటని కూడా అడిగిన సందర్భంలేదు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చిన్నో చితకో కాంట్రాక్ట్‌ ఉద్యోగం తమ జీవితాలకు చుక్కానిలా దొరికిందని బ్రతుకు వెల్లదీస్తుండగా పిడుగులాంటి ప్రభుత్వ నిర్ణయం వారిని దిక్కులేని పక్షుల్ని చేసింది. అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో గత 788 రోజులుగా న్యాయం కోసం శాంతియుతంగా […]

తెలుగుదేశం – జనసేన సమన్వయం ఎండమావి…!

రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన పార్టీల సమన్వయం ఎండమావిలా తయారైంది. అక్కడక్కడా ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మన్నట్టు వైషమ్యాలు మిన్నంటుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులతో ఇరుపార్టీల సమన్వయం రసాభసగా మారుతోంది. ఇటీవల పిఠాపురంలో ఇది భయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా జగ్గంపేటలో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో వీరి సక్యత ముందుకు సాగేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి గాయాలు

పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రయాణిస్తున్న కారు గురువారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో గిడ్డి ఈశ్వరి ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఈశ్వరితో పాటు కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. సమీపంలోని ప్రజలు వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

WhatsApp Image 2023-11-16 at 7.11.43 PM Kakinada

ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించిన తంగెళ్ళ…

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామ శివారు వుప్పర గూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన తాటాకు ఇళ్ళు దగ్ధమై సుమారు రూ. 30 లక్షల ఆర్థిక నష్టం సంభవించింది. ఈ ఘటనతో నిరాశ్రయులైన తొమ్మిది కుటుంబాల వారిని పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పరామరిశించారు. నిరాశ్రయులైన వారికి బియ్యం, నగదు అందజేశారు. బాధితులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా వుంటుందని అధైర్య పడవద్దని ఆయన ధైర్యం […]

IMG-20231116-WA0036 Political

కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బతీస్తున్న వాలంటీర్ల అవినీతి…

రాష్ట్రంలో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో వాలంటీర్ల అవినీతి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ లక్ష్యాలు నీరుగారి పోతున్నాయని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ చిలుకూరు రామకుమార్, రంబాల వెంకటేశ్వరరావు, శ్రీ ముత్తా నవీన్, తదితరులు స్థానిక ఆర్టీవో ఆఫీస్ రోడ్డులో జిల్లా పంచాయతీ ఆఫీసర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి జిల్లా పంచాయతీ ఆఫీసర్ కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతి […]

IMG-20231116-WA0037 Kakinada

జగన్నాధ పురం MSN చారిటీస్ లో ట్రాఫిక్ నిబంధనలపై సదస్సు….

కాకినాడ నగరం జగన్నాధపురం లో MSN చారిటీస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సి.ఐ. రమేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో అశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సి.ఐ. రమేష్ మాట్లాడుతూ… ప్రతీ విద్యార్థి, విద్యార్థినులు ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి తద్వారా ప్రమాదాలను నియంత్రించగలమని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది ఎస్.ఐ. కిశోర్ బాబు, ఏ.ఎస్.ఐ. రమణ మూర్తి , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.