చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరుపై సంబరాలు

బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసిపి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబునాయుడికి రెగ్యులర్‌ బెయిల్‌

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకి హైకోర్టు ఊరట కల్పించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మద్యంతర బెయిల్‌పై రాజమండ్రి కేంద్ర ఖారాగారం నుంచి బయటకు వచ్చిన ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ ను మంజూరు చేసింది. సోమవారం జరిగిన వాదోపవాదాల అనంతరం హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, తెలుగుదేశం, జనసేన నాయకులకు గొప్ప ఊరట లభించినట్టైంది.

తెలుగుదేశం – జనసేన సమన్వయ ప్రభావం..!

తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయం కొన్ని నియోజకవర్గాల్లో రసాభసగా ఉంటుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తోంది. అధికార పార్టీ నుంచి ఇరుపార్టీల సమన్వయం వైపు భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట వెంకటకృష్ణరాయపురానికి చెందిన వైఎస్‌ సర్పంచ్‌ గొల్లపల్లి సర్వేశ్వరరావుతో పాటు పంచాయితీ వార్డ్ మెంబర్స్, కన్వీనర్ పాటు పలువురు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ పరిణామంతో ఇరుపార్టీల సమన్వయంలో మరికొంత జోష్‌ […]

IMG-20231119-WA0012 Kakinada

పంతం నానాజీ ఆధ్వర్యంలో వన సమారాధన

జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇంచార్జ్, PAC సభ్యులు పంతం నానాజీ  ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో 3వ కార్తీక వన సమారాధన మహోత్సవం కాకినాడ రూరల్ కిరణ్ కంటి ఆసుపత్రి సమీపంలో గల మామిడి తోటలో జరిగింది. ఈ ఆత్మీయ సమావేశ వన సమరాధనలో 20 వేల మంది పాల్గొన్నారు. ఉదయం పూజ కార్యక్రమంతో మొదలై, ఆట పాటలతో, అతిదుల ప్రసంశలతో, ఎంతో ఘనంగా జరిగింది, విజేతలకు (ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రో […]

ఓటు హక్కుకు.. మద్యం అమ్మకాలకు.. ఆధార్ అనుసంధానం చేయాలి

మద్యం అమ్మకాలకు… ఓటుహక్కుకు… ఆధార్ అనుసంధానం చేయాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు ప్రభుత్వానికి సూచించారు. మద్యం అమ్మకాలను, మద్యపాన సేవనాన్ని నియంత్రణ చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం దరలు పెంచడం ద్వారా వినియోగదారుల సంఖ్య తగ్గిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర రాష్ట్ర పథకాలకు, ప్రభుత్వ సేవలకు ఆధార్ అనుసంధాన విధానాన్ని ఎన్నికలకు ఎందుకు అమలు చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆధార్ […]

IMG-20231119-WA0005 Crime

బొంత మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన జాతీయకార్యదర్శి పిట్టా వర ప్రసాద్…

దొమ్మేరు గ్రామంలో ఎస్.సి. యువకుడు బొంతు మహేoద్ర (21) ఆయన కుటుంబం వై.ఎస్. ఆర్ పార్టీ కి చెందిన వారు. ఆ పార్టీకి చెందిన ఫ్లక్సీ చింపాడనే అనుమానంతో ఆ పార్టీ నేతలు ఇచ్చిన పిర్యాదు తో కొవ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ దొమ్మేరు వచ్చి మహేంద్రను స్టేషన్ కు తీసుకొని వెళ్లి పోలీసుల స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తీవ్ర మనస్థాపం చెందిన మహేoద్ర గడ్డి మందు తాగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పిట్టా […]

అది సామాజిక దళిత హత్యా యాత్ర : పిట్టా వరప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌ తీవ్ర విమర్శలు చేశారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు స్వయంగా నిందితుడైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ అంగీకరించినా అతడిని ముఖ్యమంత్రి వెంటపెట్టుకుతిరగడం పట్ల వివక్షా సాధికారత కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

images (14) Cricket

బిగ్‌ స్క్రీన్‌ పై ‘భారత్‌– ఆస్ట్రేలియా’ ఫైనల్‌ మ్యాచ్‌

ప్రపంచ కప్‌లో భాగంగా ఈనెల 19న భారత్‌– ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌ను అభిమానులు పెద్ద స్క్రీన్ల (ఫేన్‌ ఎరీనా) పై తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏ.సీ.ఏ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఏ.సీ.ఏ కార్యదర్శి శ్రీ ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌ రెడ్డి వెల్లడించారు. స్టేడియంలో ఉన్న వాతావరణాన్ని కల్పించి ఆనందంగా మ్యాచ్‌ను చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. […]

Corruption C/o మున్సిఫల్‌ ఆఫీస్‌..!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిఫల్‌ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. తడిపితేనేగాని పనులు జరగని దాఖలాలు అనేకం. ప్రత్యేక సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటికీ ఈ తంతు షరామామూలే అంటున్నారు బాదితులు. గతంలో అనేక విడతలుగా ఏసీబీ అధికారులు సామర్లకోట మున్సిఫల్‌ కార్యాలయంపై దాడులు చేసి నిందిత ఉద్యోగులను సస్పెండ్ చేసినప్పటికీ ఇక్కడ అవినీతి మామూలైపోయింది. తాజాగా రూ.8,000 లంచం తీసుకుంటుండగా సామర్లకోట తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న ఉప్పు దుర్గ బాలాజీ రమణమూర్తిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా […]