IMG-20231124-WA0017 Political

అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది… -మంత్రి చెల్లుబోయిన-

అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర బీ.సీ. సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు.   మంత్రి వేణుగోపాల కృష్ణ కాజులూరు మండలంలో జరిపిన పర్యటనలో భాగంగా సమగ్ర శిక్షణా విభాగం ఆధ్వర్యంలోని కాజులూరు భవిత కేంద్రంలో చదువుతున్న 8 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన మూగ, చెవిటి దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, యాప్ లతో […]

రూ.350 కోట్లు కొట్టేసిన ఆన్‌లైన్‌ ఆర్థిక నేరగాల్లు

ఉద్యోగన్వేషణలో ఉన్న నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఆర్థిక నేరాలకు అంతేలేకుండా పోతోంది. ఏకంగా రూ.350 కోట్లకు పైనే నిరుద్యోగుల నుంచి క్రిప్టో కరెన్సీ తదితర ఆన్‌లైన్‌ రూపంలో అకౌంట్‌కు బదిలీ చేయించుకుని దుబాయ్‌లో సొమ్ముగా మార్చుకుంటున్నట్టు అనంతపురం పోలీసులు నిర్ధారించారు. ఒక బాధితుడి ఫిర్యాదు దర్యాప్తులో సైబర్ నేరగాళ్లకు చెందిన 16 ఫేక్ అకౌంట్లను పోలీసులు గుర్తించారు. సుమారు రూ. 35.59 కోట్లు లావాదేవీలు జరిగినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ శుక్రవారం వెల్లడించారు. […]

KMC సెక్రటరీ ఏసుబాబుకి గ్రేడ్ 1 కమిషనర్ గా పదోన్నతి

సమర్థవంతంగా విధులు నిర్వర్తించి కాకినాడ నగరపాలక సంస్థ కీర్తి ప్రతిష్టలు పెంపొంది స్తానని కెఎంసి గ్రేడ్ వన్ కమిషనర్ ఎం ఏసుబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగర పాలక సంస్థ సెక్రటరీ గా పనిచేస్తున్న ఏసుబాబు ఇటీవల ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కె ఎం సి స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు ద్వారా గ్రేడ్ వన్ కమిషనర్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ […]

రూ. 44 కోట్ల నిధులతో అభివృద్ధి, సంక్షేమం

కాకినాడ 16వ డివిజన్లో రూ.44 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గోగుదానయ్యపేట 16వ డివిజన్లో నిర్వహించిన వై నీడ్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి జగన్ ప్రభుత్వం ప్రత్యక్ష సహాయాన్ని అందజేసి ఆదుకుందన్నారు. ప్రజలకు మంచి చేసే నాయకులను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం లబ్ధి పొందిన ప్రతి […]

IMG-20231123-WA0047 Visakhapatanam

విశాఖలో బాధిత మత్స్యకారులకు పవన్ కల్యాణ్ భరోసా ….

విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్నిప్రమాద సంఘటనా ప్రాంతాన్ని, బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (శుక్రవారం) పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన అధిపతి ప్రకటించారు. మత్స్యకారులకు ఆపత్కాలంలో అండగా ఉంటామన్నారు. హార్భర్‌ పరిశీల అనంతరం బాధిత మత్స్యకారులతో పవన్ మాట్లాడనున్నారు.

IMG-20231123-WA0027 Political

వైసీపీ ఇసుక దోపిడీ పై సీ.పీ.ఐ. అందోళన…

వైసీపీ పాలనలో ఇసుక మాపియా అక్రమాలు పెట్రిగిపోతున్నాయని అదేవిధంగా ఈ మధ్యన మరల ఇసుక ధరలు పెంచారని దీనిపై భవన నిర్మాణ కార్మిక సంఘాలతో చర్చించి దశలు వారి పోరాటం చేస్తామని సీ.పీ.ఐ. అధ్వర్యంలో జిల్లా కలెక్టరెట్ లో అందోళన చేస్తామని దీనిని అన్ని వర్గాలు వారు జయప్రదం చేయాలని సీ.పీ.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపినిచ్చారు . సీ.పీ.ఐ. జన చైతన్య యాత్ర నాలుగవ రోజు జాంపేట, లక్ష్మీవరపు పేట ప్రాంతాలలో జరిగింది . […]

IMG_20231123_165243 Kakinada

ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు లేవు… -కాకినాడ సిటీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్-

కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు అవకాశం లేకుండా పారదర్శక పద్ధతిలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నివేదిక రూపొందిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహరావు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే బీ.ఎల్.ఓ. లు ద్వారా సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇంటింటా ఓటరు వివరాలు సేకరిచడం వారి పేర్లను ఓటరు జాబితా లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. […]

పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం

కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఓటరు జాబితా లో ఎటువంటి పొరబాట్లకు అవకాశం లేకుండా పారదర్శక పద్ధతిలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నివేదిక రూపొందిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే బీ ఎల్ ఓ ద్వారా సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఇంటింటా ఓటరు వివరాలు సేకరిచడం వారి పేర్లను ఓటరు జాబితా లో నమోదు చేయడం జరిగిందని […]

IMG-20231123-WA0022 News Crime

మైనర్‌బాలిక వివాహానికి ఏర్పాట్లు పూర్తి…

# అడ్డుకున్న ఐసిడిఎస్ సిబ్బంది సామర్లకోట పట్టణంలో మైనర్ బాలిక వివాహ తంతును ఐసిడిఎస్, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది అడ్డుకున్నారు. స్థానిక తోటవారి వీధికి చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలికకు పెద్దాపురం పట్టణానికి చెందిన ఆమె మేనమామతో వివాహం చేసేందుకు బాలిక తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం రహస్యంగా బాలికకు నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇంతలో ఆ విషయం అంగన్వాడీ సూపర్ వైజర్ ఉమా మహేశ్వరికి చేరింది. కాకినాడ చైల్డ్ వెల్ఫేర్ […]

WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధియేటర్ యాజమాన్యాల ప్రతినిధులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ… ప్రదర్శనలకు ఆమోద యోగ్యమైన సినిమాలకు చెంది ప్రభుత్వం అనుమతించడం జరుగుతుందని వాటిని […]