WhatsApp Image 2023-12-06 at 7.55.13 AM Exclusive

బాదితులను ప్రభుత్వమే ఆదుకోవాలి… -యనమల కృష్ణుడు-

టీ.డీ.పీ. ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన యనమల కృష్ణుడు మిచౌంగ్ ప్రభావానికి గురయిన తొండంగి మండలం చోడిపల్లి పేట మత్స్యకారులను, కోదాడ ఏవి నడరం రైతులను అధికారులతో వెళ్లి పరామర్శించారు. మిచౌంగ్ తీవ్ర తూఫాన్ కారణంగా రాష్ట్రమంతా అల్లకల్లోలం అయ్యిందన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మిచౌంగ్ తూఫాన్ కారణంగా ఒకవైపు పంట పొల్లల్లోకి నీరు చేరడంతో పంట నాశనమయ్యిందని, మరో వైపు వేటకు వెళ్లకపోవడంతో మత్స్యకారులు ఆర్ధికంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని […]

merlin_154270959_7209bc84-d5d9-4aed-be97-7775f64f4782-superJumbo Bapatla

తీరం దాటిన మిచౌంగ్…

తీవ్రతుఫాను మిచౌంగ్ తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం మధ్యాహనం 12:30 నుంచి 2:30 గంటల మధ్యలో బాపట్ల సమీపంలో తీరం దాటినట్లు తెలిపింది. తీరం వెంబడి గాలి వేగం గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది. మిచౌంగ్ తీరం దాటినప్పటికి ముప్పుకు గురయ్యే ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపింది.

WhatsApp Image 2023-12-05 at 4.58.23 PM Kakinada

పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం.. -నాగ నరసింహారావు-

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పారదర్శకమైన, దోష రహిత ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యమని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.వో., నగరపాలక సంస్థ కమిషనర్ సీ.హెచ్. నాగ నరసింహారావు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ-2024 లో భాగంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం పై కార్పొరేషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం 6,7,8 ద్వారా వచ్చిన దరఖాస్తుల ప్రగతిని నాగ నరసింహారావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. […]

WhatsApp Image 2023-12-05 at 5.29.06 PM Kakinada

తుఫాన్ తో నిర్మానుస్యంగా మారిన సామర్లకోట…

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో సామర్లకోట మండల పరిధిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగాఎడతెరుపు లేకుండ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటిమయమయ్యాయి. దీనితో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుఫాన్ కారణంగా ప్రజలు బయటకు రాకపోవడంతో పట్టణాలు, గ్రామాలు నిర్మానుస్యంగా మారాయి. సామర్లకోట జగనన్న కాలనీలో డ్రైన్ల సదుపాయం పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గత రెండు రోజుల వర్షాలకు కాలనీ అంతా జలమయమైంది. ప్రజలు కనీసం అడుగు తీసి బయట […]

WhatsApp Image 2023-12-05 at 4.27.48 PM Konaseema

తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో అధికారుల బృందాలు పర్యవేక్షణ…

తుఫాన్ ప్రభావానికి గురయిన ప్రాంతాలలో అధికారుల బృందాలను నియమించి నిరంతంగా పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎప్పటికప్పుడు నివాస యోగ్యమైన ప్రాంతాలలో ముంపు నివారణకు, అలాగే రైతు పంట క్షేత్రాలలో ముంపు నివారణకు ఉపాధి హామీ అనుసంధానంతో, గ్రామపంచాయతీల సహకారంతో ముంపు నీరు తొలగింపు కొరకు డ్రయిన్ లాకులకు అడ్డంగా ఉన్న తాడు తీసేందుకు చర్యలు చేపట్టారన్నారు. తుఫాన్ పరిస్థితులను మానిటరింగ్ చేస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు […]

WhatsApp Image 2023-12-05 at 4.27.49 PM Exclusive

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.. -మంత్రి విశ్వరూప్-

మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాలో పండించిన ధాన్యo రంగు మారి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. అల్లవరం మండల పరిధిలోని రెల్లు గడ్డ గ్రామంలో ఖరీఫ్ సీజన్ వరి పంటలను మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ,జిల్లా మిచౌoగ్ తుఫాన్ సహాయక చర్యల పర్యవేక్షణ ప్రత్యేక అధికారిని జి. […]

OIP (12) Visakhapatanam

హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు…

ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్‌ హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరపున న్యాయవాది ఉన్నం శ్రవణ్‌కుమార్‌ ఈ పిటిషన్ వేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో సీ.ఎం. క్యాంప్, ఇతర మంత్రులు, అధికారులు క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే హైకోర్టు త్రిసభ్య ధర్మాశనం ఇచ్చిన తీర్పులో కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన అంశాన్ని రైతులు గుర్తు […]

hqdefault (1) Kakinada

ముంపు కుటుంబాలకు ఎస్కే బాయ్స్ సహాయం…

మీచౌంగ్ తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన కుటుంబాలకు సామర్లకోట కు చెందిన ఎస్కే బాయ్స్ ఆధ్వర్యంలో కూరగాయలు, కిరాణా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సామర్లకోట పట్టణంలో 31వ వార్డు భాస్కర్ కాలనీలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీలో పలు వీదుల్లో గృహాల వద్దకు నీరు చేరింది. దానితో వార్డు కౌన్సిలర్ పాగా సురేష్ కుమార్ దానిపై స్పందించారు. దానితో ఆయన సహకారంతో భాదిత కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు, […]

WhatsApp Image 2023-12-05 at 1.36.43 PM Krishna

మిచౌన్గ్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది…

మిచౌంగ్ తూఫాన్ తో కృష్ణాజిల్లా లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఎడతెరుపులేకుండా కురుస్తూనే వున్నాయి. ఈ ప్రభావం తో కృష్ణాజిల్లా మొత్తం జలదిగ్బంధం అయ్యింది. జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకీ, పంట పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. దానితో పంట పొలాలు నీటితో తడిసి అన్నదాతకు కన్నీటిని మిగిల్చింది. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బందరు నగరం సముద్రాన్ని తలపిస్తుంది. ఎటు వెళ్లాలన్న రోడ్లు అన్ని వర్షపు నీటిలో మునిగి […]

మిచౌంగ్ నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి…

తీవ్రతుఫాను మిచౌంగ్ నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్ననంలోపు బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా తీరం దాటనుందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి విపత్తుల శాఖ వెల్లడించిది.