నేడు విజయవాడ లో APCC చీఫ్ గా భాద్యతలు తీసుకుంటునట్లు వైఎస్ షర్మిలా రెడ్డి ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా నివాళు తరువాత తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు. వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానని ఆమె అన్నారు.
సిద్ధాంతాల కోసం వైఎస్సార్ రాజశేకర్ రెడ్డి ఎంత దూరం అయినా వెళ్ళే వాడు అన్నారు. ఇవ్వాళ దేశంలో సెక్యులరిజం అనే పదానికి, ఫ్యూడలుజం అనే పదాలకు అర్థం లేకుండ పోయిందన్నారు. వైఎస్సార్ నమ్మిన సిద్ధాంతం కోసం నేను పార్టీలో ఆకరి వరకు నిలబడతాను, వైఎస్సార్ కోరుకున్నట్లు రాహుల్ గాంధీ ని ప్రధాని చేసే వరకు పోరాటం ఆగదన్నారు.

